Home తాజా వార్తలు జాతీయ చలన చిత్ర అవార్డులు గెలిపొందిన చిత్రాలివే …

జాతీయ చలన చిత్ర అవార్డులు గెలిపొందిన చిత్రాలివే …

PELLI

ఢిల్లీ : 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు ఎంపికైంది. జనతా గ్యారేజ్‌కు నృత్య దర్శకత్వం వహించిన రాజు సుందరంకు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు వచ్చింది. హిందీ చిత్రం రుస్తుం చిత్రంలో నటించిన అక్షయ్‌కుమార్‌ను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది.

జాతీయ చలన చిత్ర అవార్డులు

ఉత్తమ చిత్రం – కాసవ్ (మరాఠీ)
ఉత్తమ నటుడు – అక్షయ్ కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి – సురభి (మిన్నమినుంగు, మలయాళం)
ఉత్తమ దర్శకుడు – రాజేష్ (వెంటిలేటర్)
ఉత్తమ సహాయ నటి – జైరా వసీమ్ (దంగల్)
ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం – శివాయ్
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్
ఉత్తమ గాయకుడు – సుందర అయ్యర్ (జోకర్, తమిళం)
ఉత్తమ గాయని – ఇమాన్ చక్రవర్తి (ప్రక్తాన్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ – పీటర్ హెయిన్
ఉత్తమ బాలల చిత్రం – ధనక్ (నగేశ్ కుకునూర్)

తెలుగు సినిమాకు జాతీయ పురస్కారాలు

ఉత్తమ తెలుగు చిత్రం – పెళ్లి చూపులు
ఉత్తమ నృత్య దర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి