Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో జాతీయ పతాకానికి అవమానం

National flag Shame at the Jawahar Nagar police station

రివర్స్‌లో ఎగురవేసిన పోలీసులు
మండిపడుతున్న ప్రజలు

మన తెలంగాణ/జవహర్‌నగర్: పోలీసుల నిర్లక్షం వల్ల జాతీయ పతాకానికి అవమానం జరిగిన సంఘటన శుక్రవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రతి రోజూలాగే శుక్రవారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేసిన పోలీసులు దానిని  తిరగమళ్ల ఎగురవేసి తప్పిదం చేశారు. ఈ సంఘటన ఉదయం జరిగినా మధ్యాహ్నం వరకూ పట్టించుకోలే దు. ఈ విషయమై మీడియాలో ప్రసా రం కావడంతో సరిదిద్దుకున్న పోలీసులు బాధ్యునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతారాహిత్యం వల్లే ఈ సంఘటన జరిగిందని తెలు స్తోంది. జా తీయ పతాకానికి తీవ్ర అవమానం జరిగిందని పలువురు మండిప డుతున్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా త్రివర్ణ పతాకం ఎగురవేయడంలో నిర్లక్షంగా వ్యవహరించిన ఎస్‌పివో విజయ్‌ను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు కుషాయిగూడ ఎసిపి కృష్ణమూర్తి హెడ్ క్వార్టర్స్‌కు ఆటాచ్ చేశారు.

Comments

comments