Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రహదారి ఇలా.. ప్రయాణించేది ఎలా…?

Road-Damaged

భైంసా : భైంసా పట్టణ సమీపంలో సాత్‌పూర్ వంతెన వద్ద 44వ జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే 4, 5 ప్రమాదాలు సైతం సంబవించాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి రహాదారి దుస్తితి ఇదే విధంగా ఉంది. ఇటీవల నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన వారు నిర్మల్  వైపు నుండి బాసర వెళ్తూ రహాదారిని గమనించకపోవడంతో వారి కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడగా కారు నుజ్జునుజ్జయింది. మరో లారి ప్రమాదానికి గురైంది. అయినా అధికారుల్లో కనీస చలనం లేకుండా పోయింది. సంబంధిత శాఖాధికారులు చిన్నపనులను సైతం పట్టించు కోకపోవడంతో ఆ శాఖ అబాసు పాలవుతుంది. అధికారులు  ఇటువైపు ఇప్పటికైనా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments