Home తాజా వార్తలు భార్య ఆత్మహత్య కేసులో కబడ్డి ప్లేయర్ రోహిత్ చిల్లార్ అరెస్ట్..!!

భార్య ఆత్మహత్య కేసులో కబడ్డి ప్లేయర్ రోహిత్ చిల్లార్ అరెస్ట్..!!

kabaddi_Player_Rohit

నేషనల్ కబడ్డీ ప్లేయర్ రోహిత్ చిల్లార్ ను శుక్రవారం ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిత్ భార్య లలిత (27) రీసెంట్ గా ఆత్మహత్య చేసుకుంది. లలిత ఆత్మహత్య కేసుకు సంబంధించి రోహిత్ ను అరెస్ట్ చేశారు. రోహిత్ బెంగళూర్ బుల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

లలిత ఆత్మహత్య చేసుకునే ముందు తన భర్త, పేరెంట్స్ కోసం రెండు గంటల ఆడియో మెసేజ్ ను రికార్డు చేసింది. అందులో…. ‘నేను అంత స్ట్రాంగ్ కాదు… నేను బతకాలనుకోవట్లేదు… అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ వేదించడం నేను భరించలేకపోతున్నా’ అని రికార్డు చేసి ఉండటంతో పోలీసులు రోహిత్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అయితే, తను అదనపు కట్నం కోసం లలిత ను వేదించలేదని, అస్సలు ఇంతవరకు లలితను తను కొట్టలేదని చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇదే….

https://www.youtube.com/watch?v=VptMdUfeypM