Tuesday, April 16, 2024

రాష్ట్రపతి నిలయంలో ఘనంగా సైన్స్ డే ముగింపు వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకుని ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరిగిన సైన్స్ డే వేడుకలలో మూడవ రోజు బుధవారం ఘనంగా ముగిసాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, భారతీయ విద్యాభవన్, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ పాఠశాలల నుండి, మల్కాజ్‌గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సెంట్ మార్టిన్స్ కళాశాల, ఆంధ్ర మహిళా సభ, సివిఆర్ కళాశాల, జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల తదితర విద్యా సంస్థల నుండి వెయ్యి మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఎస్‌సి రిటైర్డ్ శాస్త్రవేత్త డా. చంద్రశేఖర్ ఇస్రో చేపట్టిన చంద్ర యాత్ర, చంద్రయాన్ ద్వారా కనుగొన్న చంద్రగ్రహ రహస్యాల గురించి, ఎన్‌ఆర్‌ఎస్‌సి పరిశోధనల గురించి విద్యార్థులకు వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. సిసిఎంబి ప్రిన్సిపాల్, శాస్త్రవేత్త డా.బిశ్వజిత్ పాల్ భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోని విజ్ఞాన ఆవిష్కారాల గురించి వివరించారు.

జన విజ్ఞాన వేదిక నుండి రాజా సైన్స్ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. ఫిబ్రవరి 26న జరిగిన క్విజ్ పోటీలో ఆక్స్‌ఫర్డ్ పాఠశాల, జెడ్‌పిహెచ్ ఎస్ జీడిమెట్ల, జెడ్‌పిహెచ్ ఇర్విన్, బారతీయ విద్య భవన్. సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నిజాం కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెంట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల విదార్థులు విజేతలుగా నిలిచారు. వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన సైన్స్ ఎక్సిబిషన్ లో జెడ్‌పిహెచ్‌ఎస్ జీడిమెట్ల, మీరంపెట్, ఇర్విన్, మాడుల్. డాన్ హై స్కూల్, ఇండస్ యూనివర్సల్ స్కూల్ విద్యార్థులు, నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల- మల్కాభిరి, సెంట్ ఫ్రాన్సిస్, ఐటిటి కళాశాల బాలానగర్, ప్రభుత్వ – శామీర్‌పేట్, భవన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ ఆకర్షణగా నిలిచాయి. వారికి బహుమతులు ప్రధానం చేశారు.

బుధవారం మూడోరోజు కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న జిఎస్‌ఐ అదనపు డైరెక్టర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ కార్య క్రమంలో భాగస్వాములైన విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లి తండ్రులు, పాఠశాల, కళాశాల నిర్వాహకులను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట్రపతి నిలయం యజమాన్యాన్ని అభినందించారు. నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు. అవుతారని తెలిపారు. చంద్రయాన్-3 లో యువ, మహిళా శ్యాస్త్రవేత్తల పాత్ర ఉందని గుర్తు చేసారు. క్విజ్ పోటీలు, సైన్స్ ఎక్సిబిషన్ లో గెలుపొందిన విజేతలను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News