Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రూ.774 కోట్ల బ్యాంక్ గ్యారెంటీతో ఆర్‌కామ్

Arccom's shares rose by 6 per cent to Rs 20.60

న్యూఢిల్లీ: టెలికామ్ ట్రిబ్యునల్ నిర్ణయించిన గడువులోగా టెలికామ్ శాఖ వద్ద రూ.774 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని సమకూర్చినట్టు రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్) పేర్కొంది.  టిడిశాట్(టెలికామ్ డిస్పూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రిబ్యునల్) ఆర్‌కామ్‌కు సెప్టెంబర్ 10వరకు గడువు విధించగా, దీనికంటే నాలుగు వారాల ముందే గ్యారెంటీ నిధిని అందించింది. 2013, 2015లో స్పెక్ట్రమ్ కేటాయింపు, 14 సర్కిళ్లలో లైసెన్స్ రద్దు చేస్తామని టెలికామ్ శాఖ హెచ్చరించిన తర్వాత కంపెనీలో సంక్షోభం ప్రారంభమైంది. తాజాగా ఆర్‌కామ్ అప్పీల్‌ను విచారించేంత వరకు నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డాట్‌ను టిడిశాట్ ఆదేశించింది. దీంతో ఆర్‌కామ్‌కు పెద్ద ఊరట లభించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఆర్‌కామ్ షేరు విలువ 6 శాతం పెరిగి రూ.20.60 వద్ద స్థిరపడింది.

Comments

comments