Home సంగారెడ్డి 25 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం

25 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం

Voters

మన తెలంగాణ/సంగారెడ్డి అర్బన్ : భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు భారత ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని 2011 జనవరి 25 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించున్నామని జిల్లా నుంచి డీఆర్‌వో రఘురామ శర్మ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాటా డ్లుతూ 15-17 సంవత్సరాల వయసు కలిగి 9-12 వ తరగతులు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఓటు లెక్కించబడును అం శంపై జాతీయ స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగు తుందన్నారు. ప్రథమ స్థానంలో గెలుపొందిన వారిని జాతీయ ఓటర్ల దినోత్సవం 2017 (జనవరి25) గౌరవ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారము చేయబడునని పేర్కొన్నారు.
– జిల్లాలోని 15-17 సంవత్సరాల వయసు గల పాఠశాల/ జూని యర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి జనవరి5 నుంచి నియోజకవర్గ స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వ హించి ప్రథమ స్థానం పొందిన వారిని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు.
– పాఠశాల/జూనియర్ కళాశాలల స్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారికి జనవరి 10,2017న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి ఎంపిక చేస్తారన్నారు.
– జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారికి జనవరి 16,2017న రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి, హైద్రాబాద్ వారికి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసి భారత ఎన్నికల సంఘం, న్యూడిల్లీకి జాతీయ పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు.
– జాతయ స్థాయిలో ఎంపిక కాబడిన వారికి వారితో పాటు ఒక సంరక్షకునికి న్యూడిల్లీ వెళ్లుటకు రవాణా భత్యములు, జనవరి 24,25 వసతి సౌకర్యం ప్రభుత్వమే భరించబడునని పేర్కొన్నారు. కావున జిల్లాలోని విద్యాధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పోటీలు నిర్వహించి మొదటి స్థానాల జాబితాను జనవరి 6లోగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి పంపాలన్నారు. ముఖ్యంగా చిత్రలేఖన పోటీలో అయిల్‌పేయింటింగ్, వాటర్ పెయింటింగ్ మరియు క్రేయూస్స్‌లతో మాత్రమే పెయింట్ చేయాలన్నారు.