Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కరీంనగర్‌కు జాతీయస్థాయి గుర్తింపు

Vinod

కరీంనగర్ ప్రతినిధి: కొండగట్టులో భారీ ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు కరీంనగర్ చుట్టు 26 కిలోమీటర్ల నాలుగు వరుస ల బైపాస్ నిర్మాణం చేయనున్నట్లు ఎంపీ బి.వినోద్ తెలిపారు. దీంతో కరీంనగర్‌కు స్థాయి గుర్తింపు లభిస్తుందని, జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి ద్వారా ముంబాయి నుండి విశాఖపట్టణం వరకు ఈస్ట్‌కోస్ట్ కారిడార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి కరీంనగర్ ముఖ్య కేంద్రంగా మారబోతుందని ఆయన అన్నారు.

అరేబియా మహాసముద్రం నుండి బంగాళా ఖాతం వరకు జరిగే రవాణాకు ఈ రహదారి ప్రధానం కాబోతుందని, తద్వారా కరీంనగర్ జాతీయ స్థాయి గుర్తింపు జరుగనుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఆవిర్భావం తరువాత బడుగు, బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అలాగే నీటి పారుదల రహదారులుతో పాటు మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు రూపొందించి అమలుకు కృషి చేస్తుందని అన్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన రెండేళ్ల కాలంలో వివిధ పథకాల సర్వేలు, అంచనాలకు వెచ్చించామని 2017 సంవత్స రంలో వీటన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే కరీంనగర్ జిల్లాలో మైనార్టీలకు ఉర్దూ ఆంగ్లంలో బోధించేందుకు మౌలానా అబుల్ కలాం కళాశాలలో కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లాలో గొర్ల పెంపకందారుల కోసం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించామని త్వరలో 60 కోట్ల రూపా యలు ఎన్‌సిడిఎస్ ద్వారా ఇప్పించడం జరుగుతుందని ఎంపీ అన్నారు. మత్స సంపదను పెంపొందించేందుకు 42కోట్ల రూపాయలు వెచ్చించి ఉచితంగా చేప పిల్లలను చెరువులలో వదిలామని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటి హోదా దక్కించేందుకు త్వరలో డిపిఆర్ సమర్పిస్తామని ఎంపి వినోద్‌కుమార్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నీటిపారుదల అభివృద్ధి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, జడ్‌పి చైర్మన్ తుల ఉమ, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ సునీల్‌రావులు పాల్గొన్నారు.

Comments

comments