Home జాతీయ వార్తలు శ్రీనగర్‌లో నిట్ రగడ

శ్రీనగర్‌లో నిట్ రగడ

ఐసియులో ఐదుగురు తెలుగు విద్యార్థులు
120 మంది ఎపి, తెలంగాణ స్టూడెంట్స్ భవితవ్యం అయోమయం
తీవ్రమైన స్థానిక, స్థానికేతర జగడం
రగిలిన మ్యాచ్ నాటి నివురుగప్పిన నిప్పు
స్థానికేతరుల ర్యాలీపై లాఠీచార్జీ

pakశ్రీనగర్ : ఇక్కడి నిట్ క్యాంపస్‌లో గత నెల చివరి నుం చి ఇప్పటివరకూ నెలకొన్న పరిస్థితులతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టి -20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- వెస్టిండిస్ మ్యాచ్ సమయంలో ఎన్‌ఐటి విద్యార్థులపై ప్రత్యేకించి స్థానికేతర విద్యార్థులపై స్థానికులు, కశ్మీరీ వి ద్యార్థులు రాళ్ల దాడి జరపడం తీవ్రస్థాయి ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికేతర విద్యార్థులు వారితో తలపడటం పరిస్థితిని దిగజార్చింది. తమపై దాడిని నిరసిస్తూ స్థాని కేతర విద్యార్థులు బుధవారం కూడా ఆందోళన కొనసా గించారు. క్యాంపస్ సందర్శనకు వచ్చిన కేంద్ర బృం దం ఎదుట స్థానికేతర విద్యార్థులు నిరసన వ్యక్తం చేశా రు. క్యాంపస్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతవరకూ తాము కేంద్ర బృందాని కి సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఉడ్రిక్తత నివా రణకు , ఉద్యమిస్తోన్న విద్యార్థుతో చర్చల కోసం హెచ్‌ఆ ర్‌డికి చెందిన త్రిసభ్య బృందం బుధవారం ఉదయం ఇక్కడికి వచ్చింది. విద్యార్థుతో చర్చించింది. హెచ్‌ఆర్‌డి లోని సాంకేతిక విద్య డైరెక్టరు సంజీవ్ శర్మ, ఫైనాన్స్ వి భాగానికి చెందిన ఫజల్ మెహమూద్, నిట్ పాలక మండలి నిర్వాహకుల ఛైర్మన్ ఎంజె జరాబరి ఈ కేంద్ర బృందంలో ఉన్నారు. నిట్‌లో ఉన్న స్థానికేతర విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవడానికి ఈ బృందం వచ్చింది. మంగళవారం స్థానికేతర విద్యార్థులు ర్యాలీ జరపగా పోలీసులు లాఠీచార్జీకి దిగారు. నిట్ క్యాంపస్‌లో జరిగిన పోలీస్ లాఠీచార్జిలో పలువురు తెలుగు విద్యార్థులు కూ డాగాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి చదువు కోసం ఇక్కడికి వచ్చిన వారికి సరైన రక్షణ లేకుండా పోయింద ని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. స్థానికేతర విద్యార్థులపై లాఠీచార్జి విషయాన్ని ఢిల్లీ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి కేంద్ర ప్రభుత్వ దృష్టి కి తీసుకువెళ్లారు. వారి భద్ర తకు చర్యలు తీసుకునేలా చూసామని ఢిల్లీలో తెలిపారు. మంగళవారం నాడు జరిగిన లాఠీచార్జి ఘటనపై బుధ వారం కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వి చారణ నిర్వహించాలని బెంగాల్‌లో ఉన్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాని కి సూచించారు.
సిఎంతో మాట్లాడా : స్మృతీ ఇరానీ
నిట్‌లో విద్యార్థుల భద్రతకు చర్యల గురించి తాను రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో చర్చించినట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీ సూరత్‌లో తెలి పారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని హామీ ఇచ్చారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో హె చ్‌ఆర్‌డి అధికారులు మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఇంటి కి వెళ్లిపోతామని చెపుతోన్న విద్యార్థులకు తగు విధమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నిట్ క్యాంపస్‌లో ఘ ర్షణలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి మెహబూబా చెప్పినట్లు మంత్రి వివరించారు. వచ్చే వారం పరీక్షలు జరిగే పరీక్షలపై ఇప్పటి ఉద్రిక్త పరిస్థితు ల ప్రభావం పడుతుందని, పరీక్షలలో తాము సరైన విధ ంగా ప్రతిభ కనబర్చలేమని విద్యార్థులు ఆందోళన చెం దాల్సిన పనిలేదని మంత్రి హామీ ఇచ్చారు. ఇక కేంద్ర హోం మంత్రిరాజ్‌నాథ్ సింగ్ కూడా రాష్ట్ర సిఎంతో ఫోన్ లో మాట్లాడారు. క్యాంపస్‌లోని కొందరు అధికారులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వారిని బదిలీ చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. క్యాంపస్ ప్రధాన గేట్ వద్ద ప్రతిరోజూ భారత త్రివర్ణ పతాకం ఎగు రవేసేందుకు అనుమతించాలని విద్యార్థులు కోరుతున్నా రు. క్యాంపస్‌ను జమ్మూకు మార్చాలని, క్యాంపస్‌లో మందిర నిర్మాణానికి అనుమతించాలని విద్యార్థులలో ఓ వర్గం డిమాండ్ చేస్తోంది.
దాల్‌లేక్ ఒడ్డున ఉద్రిక్తతల నిలయం
ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్‌లేక్ ఒడ్డున ఉన్న నిట్ క్యాంపస్‌లో గత వారం నుంచి ఘర్షణాయుత వాతావర ణం ఏర్పడుతూ వచ్చింది. సెమీ ఫైనల్‌లో ఇండియా, వెస్టిండిస్‌తో ఓటమి పాలయిన దశలో కొందరు స్థానిక విద్యార్థులు హర్షంతో బాణాసంచా పేల్చడం తరువాత పలు రకాలుగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ విద్యా ర్థుల వైఖరిని స్థానికేతర విద్యార్థులు అడ్డుకున్నారు. అయితే మార్చి 31 రాత్రి నుంచీ క్యాంపస్‌లో తీవ్రస్థాయి ఉద్రిక్తత ఏర్పడటంతో స్థానిక అధికారుల సూచన మేరకు సీమా సురక్షా బల్ వారిని కాపలాగా దించారు. స్థానిక పోలీసులు ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తు న్నారు. నిట్ ఉద్రిక్తత నేపథ్యంలో ఇప్పుడు క్యాంపస్‌లో మందిరం లేదా మజీదు ఏర్పాటు డిమాండ్ రావడంపై ని ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇది అసా ధ్యం అని పేర్కొన్నారు. జరిగింది కేవలం స్వల్ప ఘటన అని దీనిని దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్దదిగా చేశారని, వారి వారి రాష్ట్రాలకు వెళ్లిపోయేందు కు దీనిని ఓ సాకుగా తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. నిట్ క్యాంపస్‌లో చాలా కాలంగా స్థానికేత ర విద్యార్థులకు న్యాయం జరగడం లేదని, తమ పరీ క్షపత్రాలను స్థానికేతర అధ్యాపకులతో దిద్దించాలని లేక పోతే తమకు సరైన న్యాయం దక్కదని, పేపర్ల వాల్యూ యేషన్‌లో సమానత, పారదర్శకత లేదని ఆరోపణలు వెలువడ్డాయి. తాము ఉద్రిక్తతకు గురి కాకుండా ఉం డాలని లేకపోతే పరీక్షలకు తగు విధంగా సన్నద్ధం కాలే మని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.