Search
Wednesday 26 September 2018
  • :
  • :

‘బాబాయ్ ఈసారి ఇంకొంచెం మసాలా’

nani

హైదరాబాద్: పలు భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్‌బాస్ సీజన్1’ సక్సెస్ ఫుల్ అయ్యింది. సీజన్1లో నటుడు శివబాలాజీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. త్వరలో సీజన్2 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరు హోస్ట్ చేయనున్నారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా కొందరి పేర్లు వినిపించినా… చివరికి నాచురల్ స్టార్ నాని సీజన్2కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు నాని ట్విటర్‌లో అధికారిక ప్రకటన చేశాడు. బిగ్‌బాస్2కు నేనే హోస్ట్‌నని చెబుతూ.. ‘బాబాయ్ ఈసారి ఇంకొంచెం మసాలా’ అంటూ ఎమోజీని ట్వీట్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ఓ స్పెషల్ ప్రొమోని సదరు ఛానెల్ రిలీజ్ చేసింది. వెండితెరపై సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్న నాని ‘బిగ్‌బాస్’తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించనున్నాడు.

 

Comments

comments