Home తాజా వార్తలు ఆకట్టుకున్న ‘నవకళా వైభవమ్’

ఆకట్టుకున్న ‘నవకళా వైభవమ్’

మన తెలంగాణ/కాచిగూడ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అరుణా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘నవకళా వైభవమ్’ శీర్షికతో గురువారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ కళా సంబురాలు సందడిగా జరిగాయి. ప్రముఖ జానపద గాయనీ అరుణా సుబ్బా రావు నిర్వహణలో వివిధ జానపద నృత్యాంశాలు, జానపద సంప్రదాయ పాటల సమాహరంతో పాటు సినీ సంగీత విభావరి, జానపద డప్పు, కోలాటం వంటి కళా ప్రదర్శనలు కోలాహలంగా జరిగాయి.

 

ఈ కార్యక్రమానికి తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై వివిధ రంగాలల్లో నిష్ణాతులైన పలువురు ప్రముఖులను పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. జానపద కళా ప్రదర్శనలో నవకళా వైభవమ్ సరికొత్త చరిత్ర సృష్టించిందని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించిందని కొనియాడారు. ఈ సందర్భంగా అరుణా సుబ్బారావును అతిథులు సన్మానించారు. సభలో ప్రముఖ దర్శకులు డా.పిసి ఆదిత్య, ప్రముఖ సామాజికసేవకురాలు కొత్త కృష్ణవేణి శ్రీనివాస్, కృష్ణవేణి, సంస్థ ప్రధానకార్యదర్శి కృష్ణ అల్లూరి సీతారామరాజు, కోశాధికారి వి. సుబ్బారా వు తదితరులు పాల్గొన్నారు.

‘Navakala Vibhav’ Art performances at Ravindra Bharathi