Search
Wednesday 26 September 2018
  • :
  • :

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో..

Mafia-Back-Drop

గీతాంజలి, బాంబే, రోజా, సఖి వంటి ప్రేమకథలైనా, ఘర్షణ, దళపతి, యువ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోషనల్ చిత్రాలను రంజింప చేసేలా తెరకెక్కించడంలో పేరుగాంచారు మణిరత్నం. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో భారీ తారాగణంతో వస్తున్న చిత్రం ‘నవాబ్’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అరవింద స్వా మి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాష్‌రాజ్, త్యాగరాజన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేసి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకొని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మ ద్రాస్ టాకీస్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ “మణిరత్నం ద ర్శకత్వంలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రానున్న చిత్రమే ‘నవాబ్’. ట్రైలర్ అందరికీ నచ్చుతోంది. సినిమా కాన్సెప్ట్ ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మంచి యాక్షన్ ప్యాక్‌డ్‌గా ఉంటూనే ఎమోషనల్ కంటెంట్‌తో సాగే చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సంతోశ్ శివన్, సంగీతంః ఎ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్‌ః శ్రీకర్ ప్రసాద్, పాటలుః సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలుః కిరణ్.

Comments

comments