Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

షరీఫ్ గుండె శస్త్ర చికిత్స విజయవంతం

Nawaz-Sharifలండన్: ప్రిన్సెస్ గ్రేస్ హాస్పిటల్‌లో మంగళవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఐదేళ్లలో ఆయనకు ఇది రెండో గుండె చికిత్స. ప్రస్తుతం జరిగిన గుండె చికిత్స విజయవంతం అయినట్లు షరీఫ్ పార్టీ వర్గాలు తెలిపాయి. నవాజ్ షరీఫ్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం మే 22న లండన్  వెళారు అయితే ఆయన గుండెకు సంబంధించిన కొన్ని సమస్య లున్నాయని డాక్టర్లు నిర్దారించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవలని సూచించారు. దాంతో ఆయనకు మంగళవారం గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆ శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లు పిఎంఎల్-ఎన్ పార్టీ ఇంగ్లాండ్ ప్రతినిధి తెలిపారు. శస్త్ర చికిత్సకు ముందు నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాత్రమే మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని నరేంద్ర మోడీ తెలిపారని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్  పుతిన్, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా అనేక ప్రపంచ నాయకులు చికిత్సకు ముందు ఆయన కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ఇస్లామా బాద్‌లోని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. నరేంద్ర మోడీ బెస్ట్ విషెష్‌కు నవాజ్ కృతజ్ఞతలు కూడా తెలిపారని పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీస్ జకరియా చెప్పారు. నవజ్ షరీఫ్ శస్త్ర చికిత్స అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆయన కూతురు మర్యం నవాజ్ సోషల్ మీడియాలో అంది స్తున్నారు. చేసే ప్రార్థనలు  అద్భుతాలు చేస్తాయని, ఆయన గుండె చికిత్స తర్వాత స్పృహలోకి రాడానికి మరికొన్ని గంటలు పట్టవచ్చని ఆమె తన టిట్టర్‌లో తెలిపారు. నవాజ్‌కు గుండె శస్త్ర చికిత్స ఇంగ్లాండ్ కాలమానం ప్రకా రం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఆయన చికిత్సకు ముందు ధ్యైరంగా మాట్లాడారని, ఆయన భారా న్ని అల్లాహ్‌పైనే వేసామని మర్యం మొదట చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్‌కు 2011లో కూడా గుండె చికిత్స జరిగింది. అయితే ప్రస్తుతం గుండెకు సంబం ధించిన సమస్యలు తలెత్త డంతో ఆయనకు హార్ట్ ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిసింది. నవాజ్ షరీఫ్ కనీసం ఒక వారంపాటైనా ఆసుపత్రిలో ఉండనున్నారు. డాక్టర్లు అనుమతించాకే ఆయన డిశ్చార్జి అవుతారని ఆయన కూతురు మర్యం తెలిపారు.

Comments

comments