Home అంతర్జాతీయ వార్తలు విమానాశ్రయంలోనే షరీఫ్ అరెస్ట్…

విమానాశ్రయంలోనే షరీఫ్ అరెస్ట్…

Nawaj

ఇస్లామాబాద్: అక్రమాస్తుల కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్‌లను దోషులుగా తేల్చిన అకౌంటబులిటీ కోర్టు గత శుక్రవారం జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ లో కాలుమోపారు. షరీఫ్ ఆయన కుమార్తె మరియం నవాజ్‌లతో వచ్చిన విమానం లాహోర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వీళ్ల కోసం తెల్లవారుజాము నుంచి ఎదురుచూస్తున్న పోలీసులు విమానం నుంచి కాలు కింద పెట్టగానే వీరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని రావల్పిండి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు విమానాశ్రయం నవాజ్ అభిమానులు, ఆయన మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నవాజ్‌కు పదేళ్లు, మరియంకు ఎనిమిదేళ్ళ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.