Home అంతర్జాతీయ వార్తలు నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

Nawaz Sharifఇస్లామాబాద్: అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవినీతి నిరోధానికి సంబంధించిన న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. సౌదీ అరేబియాలోని ఒక ఉక్కు ఫ్యాక్టరీని కొనడానికి డబ్బు ఎక్కడిదో నిరూపించడంలో నవాజ్ షరీఫ్ విఫలమయ్యారని సోమవారం తన తీర్పులో న్యాయస్థానం పేర్కొంది. లండన్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అదే న్యాయస్థానం గత జూలైలో షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో అప్పీలుకు వెళ్లిన షరీఫ్ సెప్టెంబర్‌లో విడుదలయ్యారు.

Nawaz Sharif sentenced for Seven Years, A Pakistani anti-corruption court jailed former PM Sharif on graft charges