Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మహేష్ సినిమాలో నయన్ స్పెషల్ రోల్

nayanataraమురుగదాస్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని సమాచారం. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం మహేష్‌బాబు తమిళంలోనూ డబ్బింగ్ చెప్పబోతుండడం విశేషం. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార ఓ కీలక పాత్ర పోషిస్తుందట. ఆమెది ఓ ప్రత్యేకమైన పాత్ర అని చెబుతున్నారు. మురుగదాస్ ఆ పాత్రను వెరైటీగా డిజైన్ చేశాడట. సినిమా మొదలుపెడుతున్నప్పుడు ముందుగా నయనతారను తీసుకోవాలనుకోలేదట. ఆతర్వాత మురుగదాస్ ఈ పాత్రను తీర్చిదిద్ది నయన్‌ను అడగ్గా ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ ఉండాలన్న ఉద్దేశ్యంతో నయనతారను తీసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో మహేష్‌తో తొలిసారి రకుల్‌ప్రీత్ సింగ్ రొమాన్స్ చేయనుంది. ఎస్.జె.సూర్య విలన్ పాత్ర చేస్తుండగా… నయన్ కూడా చేరితే అదనపు ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక నయనతార గతంలో మురుగదాస్ తీసిన ‘గజిని’ సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ పాత్ర ఆమె కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. ఆ కృతజ్ఞతతోనే మురుగదాస్ తాజా మూవీకి ఈ బ్యూటీ ఓకే చెప్పినట్లు తెలిసింది.

Comments

comments