Home వార్తలు ప్రియుడిని ప్రోత్సహిస్తోంది!

ప్రియుడిని ప్రోత్సహిస్తోంది!

nayanataraనయనతార హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. టాప్ హీరోలతోనే కాదు యంగ్ హీరోలతోనూ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటోంది. భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ అందాలతార తన రెమ్యునరేషన్‌ను కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ పోవడం విశేషం. తాజాగా ఈ భామ తనకు ప్రియుడైన ఓ దర్శకుడిని సిఫార్సు చేస్తోందని సమాచారం. ఇటీవల మాయ, తని ఒరువన్, నానూ రౌడీదాస్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి నయనతార టాప్ హీరోయిన్‌గా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఈ చిత్రాలలోని రెండింటిలో ఆమె యంగ్ హీరోలతో నటించింది. కాగా నాను రౌడీదాన్ చిత్రం విజయం తర్వాత ఈ చిత్ర జంట అయిన విజయ్ సేతుపతి , నయనతారలతో ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఓ చిత్రం చేయడా నికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ చిత్రానికి కాల్‌షీట్స్ కేటాయించే విషయమై నయనతార ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కాగా తని ఒరువన్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఆ చిత్ర దర్శకుడు మోహన్ రాజా… శివ కార్తికేయన్‌తో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా నయన్… శివకార్తికేయన్‌కు ఫోన్ చేసి మీరు నాతో నటించాలనుకుంటే విఘ్నేష్ శివ దర్శకత్వంలో నటించండి అని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. దీంతో విఘ్నేష్ శివ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అంతేకాదు విజయ్‌సేతుపతిని పక్కన పెట్టే యుక్తిలోనూ నయనతార సఫలమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నట్లు ఈ భామ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ అయింది. స్టార్ హీరో వెంకటేష్ సరసన ‘బాబు బంగారం’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. శ్రీరామ రాజ్యం చిత్రం తర్వాత నయనతార నటిస్తున్న తెలుగు చిత్రం ఇదేకావడం గమనార్హం.