Search
Friday 21 September 2018
  • :
  • :

నయన్ నటన హైలైట్‌గా…

Nayanathara Act In Tamil Movie kolamavu kokila

టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార తమిళంలో నటించిన చిత్రం ‘కొలమావు కోకిల’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. డ్రగ్స్ సరఫరా చేసే ముఠా చుట్టూ తిరిగే ఈ సినిమాలో నయన్ నటన, అనిరుధ్ సంగీతం హైలైట్‌గా నిలిచింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అయితే అక్కడక్కడ నెమ్మదించిన కథనం ఈ సినిమాకు కొంత మైనస్‌గా మారిందని అంటున్నారు తమిళ ప్రేక్షకులు. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నయన్ మరోసారి మంచి విజయాన్ని సాధించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ‘కోకిల కోకిల’ పేరుతో తెలుగులో విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

Comments

comments