Home సినిమా నయనతార చుట్టూ కథ

నయనతార చుట్టూ కథ

Nayanathara

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు ‘దర్బార్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే హీరోయిన్ నేపథ్యంలో ఈ సినిమా కథ తిరుగుతుందట. నిజానికి మురుగదాస్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ నయనతార కావడంతో ఆమె స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాడట మురుగదాస్. పూర్తిగా నయనతార యాంగిల్ నుండే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఓవైపు సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార పాత్రలతో ‘దర్బార్’ చిత్రాన్ని సమ్‌థింగ్ స్పెషల్ తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Nayanthara starts shooting for Rajinikanth Darbar Movie