Home తాజా వార్తలు నాయని కృష్ణమూర్తి కన్నుమూత

నాయని కృష్ణమూర్తి కన్నుమూత

Krishna-Murthy1

చిత్తూరు:  ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి (67) గురువారం ఉదయం  కన్నుమూశారు.  బెంగళూరు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నాయని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. మాబడి, పాఠశాల మ్యాగజైన్లను కృష్ణమూర్తి నడిపించారు. చిత్తూరు జిల్లా ఆయన స్వగ్రామం చౌడేపల్లిలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. మహాభారత మూలకథ అయిన జయమ్ పుస్తకంతో పాటు అనేక నవలలు, కథలు, ఆధ్యాత్మిక గ్రంధాలను కృష్ణమూర్తి రచించారు. మహర్షి సినిమాలో ‘సుమం ప్రతి సుమం సుమం’ పాటను కృష్ణమూర్తి రాశారు. కృష్ణమూర్తి మృతికి పలువురు విద్యావేత్తలు, రచయితలు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. తెలుగు సాహిత్య సేవలకుగాను జీవనసాఫల్య పురస్కారం ఆయన అందుకున్నారు. ఏకకాలంలో బహుళ రంగాల్లో ఆయన పనిచేశారు. చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951 లో జన్మించారు.