Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎసిబికి చిక్కిన అవినీతి చేప

రూ.16వేలు తీసుకుంటూ  ఇఒపిఆర్‌డి పట్టివేత
అధికారుల అవినీతి లీలలపై  చర్చనీయాంశం

Contractor

మంచిర్యాలప్రతినిధి: ప్రభుత్వం అధికా రుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నప్పటికి కొన్ని శాఖల్లో అవినీతి వ్యవహారం సమసిపోవడం లేదు. పారదర్శక పా లన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అవినీతి అధికారు లు తమదైన శైలీలో తూట్లు పొడుస్తూ చేతి వాటం చూపు తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంద మర్రి పంచాయతీ రాజ్‌కు చెందిన ఇఓపిఆర్‌డి నజీరోద్దీన్ ఒక కాంట్రాక్టర్ నుండి బిల్లు చెల్లింపు వ్యవహారంలో రూ. 16 వేలు లంచం డబ్బులు తీసుకుంటూ గురువారం ప ట్టుబడ్డారు.

ఈ వ్యవహారం జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో చ ర్చనీయాంశంగా మారింది. మందమర్రి మండలం అం దుగులపేటకు చెందిన వార్డు సభ్యుడు దుర్గం శ్రీనివాస్ చేపట్టిన ఒక అభివృద్ధి పని బిల్లు రూ. 5 లక్షల చెక్కు మం జూరు విషయంలో ఇఓపిఆర్‌డి బాధితుని నుండి లంచం డబ్బులు డిమాండ్ చేశారు.అ ధికారి ఒత్తిడి తట్టుకోలేక శ్రీనివాస్ ఏసిబి అధికారులను ఆశ్రయించి ఇఓపిఆర్‌డి వ్య వహారాన్ని వివరించారు.

కాంట్రాక్టర్ బిల్లు చెల్లింపు విషయంలో ఇఓపిఆర్‌డి నజీ రోద్దీన్ రూ. 16 వేలు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. శ్రీనివాస్ ఇచ్చిన సమా చారంలో అధికారులు వ్యూహాత్మాకంగా వ్యవహిరంచి మ ంచిర్యాల పట్టణంలోని గీతాభవన్ హోటల్‌కు రప్పించా రు. ఇఓపిఆర్‌డి బాధితుని నుంచి రూ. 16 వేలు తీసుకు ంటుండగా అక్కడే మాటు వేసిన అధికారులు ఆకస్మిక దా డి నిర్వహించి, లంచం డబ్బులు స్వాధీనం చేసుకొని, అ ధికారిని అదపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయమై డిఎస్‌పి పాపాలాల్ శ్రీరాంపూర్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లంచం డబ్బులు తీసుకుం టున్న అధికానిని అధుపులోకి తీసుకొని కేసు మోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.అధికారులు ఎవరైన లం చం డబ్బులు డిమాండ్ చేస్తూ భయాందోళనకు గురి కా కుండా ప్రజలు ఏసిబిని ఆశ్రయించాలని ఈ సందర్భం గా ఆయన సూచించారు. డిఎస్‌పి వెంట ఎసిబి అధికా రులు పాల్గొన్నారు.

Comments

comments