Home జాతీయ వార్తలు మరో రెండు రోజుల పాటు16 రాష్ట్రాలకు భారీ వర్షాలు

మరో రెండు రోజుల పాటు16 రాష్ట్రాలకు భారీ వర్షాలు

heavy rainfall in 16 States

న్యూఢిల్లీ: కేరళను వణికిస్తున్న వర్షాలు మరో రెండు రోజుల పాటు మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్లకల్లో పరిస్థితుల కారణంగా రానున్న 2 రోజుల్లో 16 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఏ) హెచ్చరించింది.  పశ్చిమ బెంగాల్‌  కేరళ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ తోసహా 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళతో పాటు అసోం,అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, బీహార్, జార్ఖండ్, ఒడిషా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత కర్నాటక, తమిళనాడులో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.