Search
Friday 21 September 2018
  • :
  • :

ఇంజినీరింగ్‌కు ‘నీట్’ తరహా పరీక్ష

students

 విద్యాసంవత్సరం నుంచి కొత్త విధానం అమలు?
 తగ్గనున్న పరీక్షల భారం!

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంజినీరింగ్ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ తరహా ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్ కోర్సు రాష్ట్ర ఎంసెట్ పరిధిలో ఉండకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధిం చి కేంద్రం వేగవంతంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం. జాతీయస్థాయిలో నిర్వహించే జెఇఇ మెయిన్ ద్వారానే ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటిలతోపాటు రాష్ట్రాలలోని ఇంజినీరింగ్ కళాశాలల్లోని సీట్లు భర్తీచేసే అంశంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) కసరత్తు చేస్తోంది. జెఇఇ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం ఆ పరీక్ష ద్వారానే దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది నుంచే నుంచి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడంతో దానిని వాయిదా వేశారు. వచ్చే విద్యాసంవత్సరం అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా సేకరించి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంటుందా..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి విధానం అమలవుతోంది. జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహిస్తే అందు లో వెయిటేజి ఉంటుందా..? లేదా..? అనే అంశంపై స్పష్టత రావా ల్సి ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని, తమ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ డిమాండ్ పడిపోతుండటంతో దానికి ప్రవేశ పరీక్ష అవసరమే లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ మార్కులతోనే ప్ర వేశాలు చేపట్టడం మేలని సూచిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో టాప్ టెన్ కళాశాలలు మినహా మినతా కళాశాలల్లో ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఏటా ఇంజినీరింగ్ విభాగంలో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉంటున్నాయి.ప్రస్తుతం ఇంజినీరింగ్ సీటు కోసం ఒక్కో విద్యార్థి కనీసం ఐదు పరీక్షలు రాయాల్సి వస్తోంది. జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష అమలులోకి వస్తే ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వివిధ ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపశమనం లభిస్తుంది. ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైన సిలబస్ ఉండడంతో ఏ పరీక్షపైన పూర్తి స్థాయిలో దృష్టి సా రించాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాలలోని ఇంజినీరింగ్ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించడం లేదన్న భావనతో వేలాదిమంది విద్యార్థులు కనీసం మూడు నాలుగు డీమ్డ్ వర్శిటీల ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు.
అలాగే ఎన్‌ఐటి, ఐఐటిలలో ప్రవేశాలకు ని ర్వహించే జెఇఇ మెయిన్స్, అ డ్వాన్స్‌డ్‌తో పాటు తెలంగాణ, ఎపి ఎంసెట్ పరీక్షలకూ హాజరవుతున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఫీజులు చెల్లించా ల్సి వస్తోంది. ఈ నేపథ్యం లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నీట్ తరహాలో జాతీయ స్థా యిలో ప్రవేశ పరీక్ష అమలులోకి వస్తే విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎంసెట్ నుంచి వైద్య విద్యకు తొలగిపోవడంతోనే ఈ పరీక్షకు ప్రాధాన్య త తగ్గగా, ఇంజనీరింగ్ కోర్సులు కూడా తొలగిస్తే ఎం సెట్ ప్రాధాన్యత మరింత తగ్గుతుంది. ప్రస్తుతం ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, బి.ఎస్‌సి(అగ్రికల్చరల్), వెటర్నరీ కోర్సులతోపాటు తాజాగా ఫారెస్ట్ కోర్సుల సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇందులో బి.ఎస్‌సి(అగ్రికల్చరల్), వెటర్నరీ కోర్సులకు డిమాండ్ ఉండగా, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు మాత్రం అంతగా డిమాండ్ లేదు. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే, ఫార్మసీ, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫారెస్ట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించనున్నారు.

Comments

comments