Home తాజా వార్తలు చంపేస్తారేమో..!

చంపేస్తారేమో..!

Neerav did not come to Bharat with threat of life

 

ప్రాణ భయంతోనే నీరవ్ రావడం లేదు
మూకదాడి చేస్తారేమోననే ఆయన ఆందోళన
కోర్టుకు తెలిపిన న్యాయవాది

ముంబయి: భారత్‌కు వస్తే జనం మూకదాడి చేసి చంపేస్తారేమోనన్న భయంతోనే నీరవ్ మోడీ ఇక్కడికి రావడం లేదని ఆయన తరఫు న్యాయవాది ప్రతేక కోర్టుకు తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. నీరవ్ మోడీ భారత్‌కు రాలేరని, ఆయనను రావణుడితో పోలుస్తున్నారని, మూకుమ్మడి దాడి చేసి చంపేస్తారని ఆయన భయపడుతున్నారని నీరవ్ మోడీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ పిఎంఎల్‌ఎ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టుకు తెలియజేశారు. అయితే ఇడి ఆయన వాదనలను ఖండించింది. ప్రాణ భయం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది.

పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్ట కింద నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని ఇడి దాఖలు చేసిన పిటిషన్‌పై పిఎంఎల్‌ఎ కోర్టులో వాదోపవాదాల సందర్భంగా అగర్వాల్ ఈవిషయాలు వెల్లడించారు. అలాగే నీరవ్ మోడీ వద్ద ఆర్థిక పరమైన వివరాలు, సమాచారం ఏదీ లేదని, వాటిని చూసుకునే ఆయన ఉద్యోగులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. అయితే నీరవ్ దర్యాప్తుకు సహకరించడం లేదని, సమన్లకు,ఈ మెయిళ్లకు స్పందించడం లేదని ఇడి కోర్టుకు తెలిపింది. ఆయన భారత్‌కు రావాలని అనుకోవడం లేదని కూడా వాదించింది. దీనికి నీరవ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, నీరవ్ దర్యాప్తు సంస్థల ఈ మెయిళ్లకు స్పందిస్తున్నారని, తన భద్రతపై ఆందోళన వల్లనే భారత్‌కు రాలేకపోతున్నానని సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు.‘

ప్రైవేటు వ్యక్తులు, పిఎన్‌బి కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, భూస్వాములు, అప్పులు ఇచ్చిన వాళ్లు, వినియోగదారులు (వారివద్దనుంచి ఇడి ఖరీదయిన నగలు స్వాధీనం చేసుకుంది), తదితరులనుంచి నాకు ప్రాణహాని ఉంది. భారత్‌లో 50 అడుగుల నా దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడ మూకదాడులు జరుగుతున్న ఆధారాలున్నాయి. నన్ను రావణాసురుడితో పోలుస్తున్నారు. నన్ను దయ్యంగా, బ్యాంకు కుంభకోణానికి పోస్టర్ బాయ్‌గా చూపిస్తున్నారు. నా ఆర్థిక వ్యవహారాలు చూసుకునే ఉద్యోగులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు’ అని ఇడి, సిబిఐకి రాసిన లేఖలో నీరవ్ మోడీ పేర్కొన్నట్లు ఆయన న్యా యవాది తెలిపారు.

నీరవ్‌ను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించడానికి వీలు లేదని, ఎందుకంటే చట్టంలో నిర్దేశించిన అనేక న్యాయపరమైన అంశాలను దర్యాప్తు ఏజన్సీ నెరవేర్చలేదని కూడా ఆయన వాదించారు. అంతేకాదు, విజయ్ మాల్య దేశం వదిలిపెట్టి వెళ్లే సమయానికి రూ. 9 వేల కోట్ల రుణాలు బకాయి ఉన్నారని, నీరవ్ దేశం వదిలివెళ్లే సమయానికి ఆయన పేరి ట నిరర్థక ఆస్తులు ఏవీ లేవని కూడా అగర్వాల్ వాదించారు. అయితే ఈ వాదనలన్నీ అర్థం లేనివని, చట్టంతో సంబంధం లేనివని ఇడి కోర్టుకు స్పష్టం చేసింది.

Neerav did not come to Bharat with threat of life

Telangana Latest News