Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

క్యూట్ లవ్ స్టోరీ

'Neethone Hai Hai' wraps up first schedule

కెఎస్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో డా.ఎస్.కీర్తి, డా.జి.పార్థసారధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. బి.యన్.రెడ్డి అభినయ దర్శకుడు. అరుణ్‌తేజ్, ఛరిష్మా శ్రీకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బి.యన్.రెడ్డి అభినయ మాట్లాడుతూ “నిర్మాతల పూర్తి సహకారంతో తొలి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తిచేశాం. ఈనెల 20 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. పది రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్‌లో టాకీతో పాటు ఒక పాట చిత్రీకరించనున్నాం. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మే నెలలో రెండు పాటలను కేరళలోని మున్నార్‌లో, మరో పాటను వైజాగ్‌లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం. డబ్బున్న వ్యక్తుల వ్యక్తిత్వాలు, మధ్యతరగతి వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయనే ఆసక్తికరమైన అంశానికి క్యూట్ లవ్ స్టోరీ జత చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం”అని అన్నారు. చిత్ర నిర్మాతలు డా.ఎస్.కీర్తి, డా.జి.పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ “దర్శకుడు బి.యన్.రెడ్డి అభినయ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కృష్ణప్రియపై చిత్రీకరించిన ఐటమ్‌సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది”అని పేర్కొన్నారు. ఆనంద్, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, జయచంద్ర, రత్నప్రభ, శ్రీప్రియ, జబర్దస్త్ రామ్‌ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః ఈదర ప్రసాద్, సంగీతంః రవి కళ్యాణ్, సాహిత్యంః వెంకట బాలగోని, ప్రవీణ్, కొరియోగ్రఫీః సాయిరాజ్.

Comments

comments