Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నిర్లక్ష్యం నీడలో ‘ఫసల్ బీమా’ పథకం

Neglect of the implementation of the Fosal Bima Yojana Scheme

మన తెలంగాణ/వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి : ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఫసల్ బీమా యోజన పథకం’ అమలులో నిర్లక్షం జరుగుతోంది. అధికారుల అలసత్వంతో మరుగునపడుతోంది. వెరసీ రైతులు నష్టపోవద్దనే ఉద్ధేశ్యంతో ప్రవేశపెట్టిన పథకం ప్రయోజనాలు రైతుల ధరి చేరడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసేందుకు యంత్రా ంగం తగు చర్యలు చేపట్టకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కనీసం 5శాతం మంది రైతులు కూడా బీమా ప్రీమియంలో భాగస్వాములు కాకపోవడం ఇందుకు సాక్షంగా నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా యంత్రాంగం పథకం పట్ల రైతులకు అవగాహన కల్పించకపోవటం, అందుకనుగుణమైన ప్రచారాలు నిర్వహించకపోవడం తో బీమా ప్రీమియం చెల్లించే గడువును పెంచినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని పలువురు భావిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని 15 మండలాలలో సుమారు 1లక్షా 36 వేల 619 మంది రైతులున్నారు. వరి పంటతో పాటు, పత్తి, మిర్చి, పసుపు, మొక్కజోన్న, వేరుశనగ తదితర పంటల సాగుతో వ్యవసాయమే జీవనాధారంగా న్నారనేది గమనార్హం.

జిల్లాలో సుమారు 150 హెక్టార్లు సాగులో ఉన్నట్లు ప్రథమిక అంచన. అయితే ఇప్పటి వరకు బ్యాంకు రుణాల ద్వారా 3300 మంది రైతలు ఏడు వేల ఎకరాల్లో బీమా చేయించుకున్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. ఇవి కూడా బ్యాంక్ రుణాలు ఇచ్చే సమయంలోనే ఎక్కువగా బీమా చెయించుకోవడ జరగుతుందనేది గమనించాలి. ఇందులోనూ వ్యవసాయ అధికారలు బీమా ప్రిమీయంలో రైతులను భాగస్వాములను చేసింది కూడా రెండు వందల ఎకరాలకు సంబంధించి, రెండువందల మంది రైతులకు మిం చని సంఖ్య ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం అమలు సక్రమంగా లేదని భావించి ప్రిమీయం గడువు పొడిగించిన విషయం విధితమే. మిర్చి, వేరు శనగ, మొక్కజోన్న, పసుపు లాంటి వాణిజ్య పంటల సాగు చేసే రైతులను ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వాములను చేసుందుకు ఈ నెల 31 వరకు అవకాశాన్ని కల్పించడంతో పాటు, ఆగస్టు 31 వరకు వరి, పత్తి పంటల సాగు చేసే రైతులకు అవకాశం కల్పిస్తు బీమా ప్రిమీయం గడువును పెంచినప్పటికీ పథకం అమలు చేసేందుకు అధికారుల తీరు మాత్రం మారకపోవడం విమర్శలకు తావిస్తోంది

. రాష్ట్ర ప్రభుత్వ పథకం రైతు బంధు పథకం పట్ల చేసినంత ప్రచారం కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి ఫసల్ బీమా యోజన పథకం ప్రచారం చేయడం లేదనే ఆరోపణలు సైతం మిన్నంటడం గమనార్హం. పథకం పట్ల రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడం, ప్రచారం అంతగా చేయకపోవడంతో గత ఖరీప్, యాసంగిలో రైతులు పథకం పట్ల అంతగా భాగస్వాములు కాలేకపోయారనే అభిప్రాయాలున్నాయి. ఏదిఏమైనప్పటికీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పథకం రైతుల ధరి చేరే విధంగా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందనేది గమనార్హం.

Comments

comments