Search
Saturday 22 September 2018
  • :
  • :

హరితహరంలో నిర్లక్ష్యం

Neglected in the in Haritaharam

నర్సరీ దాటకుండానే ఎండిన  వేలాది మొక్కలు
అధికారుల చేతిలో కాకిలెక్కలు
మేడిపల్లిలో కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

అధికారుల పర్యవేక్షణ లోపం… సిబ్బంది పట్టింపులేని తనం.. వెరసి వేలాది మొక్కలు ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోయా యి. పచ్చదనం పెంచేందుకు నర్సరీల ఏర్పాటు కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చి స్తుండగా అధికారులు, ఇజిఎస్ సిబ్బంది నిర్ల క్షానికి మేడిపల్లి మండలం లోని రెండు నర్సరీ ల్లో వేలాదిగా ఎండి పోయిన మొక్కలు సజీవ సాక్షంగా నిలుస్తున్నాయి. హరితహారంలో భా గంగా నర్సరీల్లో లక్షలాది మొక్కలు పెంచి ప్రతి గ్రామానికి 40 వేల మొ క్కలు పంపినట్లు అధి కారులు ప్రభుత్వానికి కాకి లెక్కలు చూపించగా ఆ రెండు నర్సరీల్లో అంత పెద్ద మొత్తంలో ఎండిపోయిన మొక్కలు ఎలా ఉన్నా యనేది ప్రశ్నార్ధకంగా మారింది.

మనతెలంగాణ/మేడిపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ విడత హరితహారంలో భాగంగా మేడిపల్లి మండల కేంద్రంతో పాటు కట్లకుంట గ్రామంలో ఇజిఎస్ నిధులు లక్షలు ఖర్చు చేస్తూ మొక్కల పెంపకం చేపట్టారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను గ్రా మాలకు పంపించి నాటించాల్సి ఉండగా ఆ రెండు నర్సరీల్లోంచి ఒక్క మొక్క కూడా బయటకు రాలేదంటే అధికారుల నిర్లక్షం మూలంగా ఏ స్థాయిలో ప్రజాధనం వృథా అవుతోందో స్పష్టమవుతోంది. మేడిపల్లి, కట్లకుంటలో ఫిభ్రవరి, 2017లో ఇజిఎస్ నిధులు రూ.10 లక్షలు వెచ్చించి ఒక్కో నర్సరీలో లక్ష మొక్కల చొప్పున పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆ రెండు నర్సరీల్లో పెంచిన మొక్కలను ముందుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం గ్రామానికి 40 వేల చొప్పున మొక్కలు సరఫ రా చేసి ఖాళీ స్థలాల్లో నాటించాలని నిర్ణయించారు. మొక్కలను గ్రా మాలకు రవాణా చేసినందుకు ఒక్కో మొక్కకు 90 పైసల చొప్పున, నా టిన మొక్కలకు నీరు పోసి సంరక్షించేందుకు ప్రతి ట్యాంకర్‌కు రూ. 480 చెల్లించినట్లు ఖర్చు చూపారు.
అయితే ఈ రెండు నర్సరీల్లో పెంచిన రెండు లక్షల మొక్కల్లో ఒక్క మొ క్కను కూడా బయటకు తీయని అధికారులు తమ లెక్కల్లో మాత్రం గ్రామానికి 40 వేల చొప్పున సరఫరా చేశామని రికార్డుల్లో పేర్కొనడం, లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని లెక్కలు చూపడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.కంచె చేను మేసిన చందంగా కట్లకుంట, మేడిపల్లి గ్రా మాల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి గత మా ర్చి 8న సామాజిక తనిఖీ బృందం సర్వే వివరాల్లో సైతం ఈ అవినీతి బాగోతం బయటకు రాలేదంటే అధికారులు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో స్పష్టమవుతోంది.
ప్రతి ఖాళీ స్థలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఎప్పటికప్పుడు హరితహారంపై అధికారులతో సమీక్షలు నిర్వహించడం, తనిఖీలు చేపడుతుండగా మేడిపల్లి మండల అధికారులు మాత్రం హరితహారం పథకానికి తూట్లు పొడుస్తున్నారు. రెం డు నర్సరీల్లో పెంచిన రెండు లక్షల మొక్కలను వృధాగా వదిలేయడా న్ని బట్టి చూస్తే అధికారులు ఎంత బాధ్యతరాహిత్యంగా, నిర్లక్షంగా వ్యవహరించారో తెలుస్తోంది.ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ రెండు నర్సరీల్లో పెంచిన మొక్కలెన్నీ… పెంచిన మొ క్కలను ఏఏ గ్రామాలకు సరఫరా చేశారు..ఎక్కడెక్కడ నాటారనే విషయమై లోతుగా విచారణ జరిపితే అవినీతి అక్రమాలన్నీ బయటపడతాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Comments

comments