Home వరంగల్ రూరల్ ప్రమాదపు అంచున ప్రయాణం..!

ప్రమాదపు అంచున ప్రయాణం..!

negligent driving consequences
ఈ చిత్రాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది.. వామ్మో అని నోరెల్లబెట్టి గుండె మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యపోయారు కదూ.. ఇలాంటి విచిత్ర సంఘటనలు చూస్తే ఎవ్వరికైనా ఇలాగే అనిపిస్తుంది.. ఇద్దరు మాత్రమే వెళ్లాల్సిన వాహనంపై నలుగురు పిల్లలు, ఇద్దరు పెద్దలు కలిసి ఆరుగురు వ్యక్తులు కిక్కిరిసి కూర్చుండి పోతున్నారంటే భయాందోళనలకు గురి కావాల్సిందే.. కనీసం వాహనం హైండిల్ సరిగా తిప్పేందుకు కానీ, ఎదురుగా వచ్చే వాహనాలను చూసేందుకు కానీ వీలులేనంతగా ఉంది వాహనం నడుపుతున్న వ్యక్తికి. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఓ ద్విచక్ర వాహనం రయ్యి మంటూ వచ్చి ఓ హోటల్ వద్ద ఆగింది. దాని పైనుంచి ఆరుగురు వ్యక్తులు దిగి అల్పాహారం భుజించి తిరిగి అదే వాహనంపై ఎక్కి వెళ్తుంటే అంతా అవాక్కయ్యారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఇంత మందికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న దృశ్యాన్ని ్న మనతెలంగాణ క్లిక్ చేసింది.