Home తాజా వార్తలు జనం మధ్యలో మనం…(‘నేల టిక్కెట్టు’ టీజర్)

జనం మధ్యలో మనం…(‘నేల టిక్కెట్టు’ టీజర్)

Nela Ticket Movie Teaser Out Now

హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ, కళ్యాణ్‌కృష్ణ కురసాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం ఆదివారం ఉదయం విడుదల చేసింది. రవితేజ శైలిలో వినోదభరితంగా ఉందీ టీజర్. ఇక టీజర్‌లో రవితేజ పలికిన ‘నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే.. నేల నాకించేస్తారు’ అనే డైలాగ్ బాగుంది. మాస్ రాజా సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, బ్రహ్మానందం, అలీ, పోసాని, ప్రియదర్శి, జయప్రకాష్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ మూవీకి స్వరాలు అందిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 24న సినిమా విడుదల కానుంది.