Home జాతీయ వార్తలు అదృష్టమంటే ఈ చిన్నారిదే ( షాకింగ్ వీడియో)

అదృష్టమంటే ఈ చిన్నారిదే ( షాకింగ్ వీడియో)

Nelamangala bike accident, miraculously kid is saved

కర్నాటక: ఆ చిన్నారికి భూమ్మీద నూకలు ఇంకా మిగిలున్నాయి కాబోలు… అందుకే అంత పెద్ద ప్రమాదం నుంచి ఒంటిపై చిన్న గాటు కూడా పడకుండానే  బయట పడింది. బెంగళూరులో జరిగిన ఓ బైక్ యాక్సిడెంట్ సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైవేపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంట ముందున్న ఓ స్కూటిని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అతివేగంగా వెళ్తున్న ఆ బైక్ ఆ స్కూటిని ఢీకొంది. ఈ రోడ్డుప్రమాదంలో ఆ స్కూటిపై ఉన్న వ్యక్తితోపాటు బైక్‌పై ఉన్న దంపతులు కూడా కిందపడిపోయారు. కాగా, వాళ్ల చిన్నారి మాత్రం అలాగే బైక్‌పై ఉండిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆ బైక్ సుమారు ఆఫ్ కిలోమీటరు మేర ట్రక్ వేనకాలే ముందుకెళ్లిపోయింది. అనంతరం పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని బైక్ పడిపోయింది. దాని మీద ఉన్న చిన్నారి మాత్రం డివైడర్‌పై ఉన్న పచ్చిక బయల్లు పడటంతో పెను ప్రమాదం తప్పింది. కార్తీక్ గౌడ అనే వ్యక్తి కారు డ్యాష్ బోర్డ్ కెమెరాలో ఈ ప్రమాదం తాలూకు వీడియో రికార్డ్ అయింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లిదండ్రులకు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం దవాఖానలో చికిత్సపోందుతున్నారు.