Home అంతర్జాతీయ వార్తలు నెల్సన్ మండేలా అరెస్టుకు సిఐఎ కారణం: మాజీ గూఢచారి

నెల్సన్ మండేలా అరెస్టుకు సిఐఎ కారణం: మాజీ గూఢచారి

Nelson-Mandelaన్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా అరెస్టు, 27 ఏళ్ల  జైలు జీవితానికి కారణం అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ  కారణమని మాజీ సిఐఎ ఏజెంట్ డొనాల్డ్ రికార్డ్ చెప్పారు. ఆయన ఈ విషయాన్ని సినీ నిర్మాత జాన్ ఇర్విన్‌కు చెప్పినట్లు ‘ సండే టైమ్స్’ పేర్కొంది. 1962లో  మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నెల్సన్ మండేలా అరెస్టును రికార్డ్ సమర్థించారు. సోవియట్ యూనియన్ బయట అత్యంత ప్రమాదకర కమ్యూనిస్టుగా మండేలాను ఆయన పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో అధికారికంగా అమెరికా వైస్ కాన్సుల్‌గా రికార్డ్ పనిచేశారు. మండేలా నటాల్‌కు వెళ్లబోతున్నారని, అందు కోసం ఆయన జోహన్స్‌బర్గ్ నుంచి డర్బన్‌కు ప్రయాణిస్తున్నారని తనకు తెలిసిందని రికార్డ్ చెప్పారు. ఆయన ఎలా వస్తున్నది తాను తెలుసుకుని తెలిపానని, దాంతో మండేలా అరెస్టయ్యారని రికార్డ్ చెప్పినట్లు ఫ్రాన్స్ 24 పేర్కొంది. మండేలా 28 ఏళ్ళపాటు  జైలు జీవితం గడిపాక,  జాతి వివక్షపాలనానంతరం 1994లో దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఆయనని చరిత్రలో మానవ హక్కుల కార్యకర్తగా కీర్తించారు. సినీ నిర్మాత ఇర్విన్, నెల్సన్ మండేలా చివరి రోజులపై  బయోపిక్ ‘మండేలాస్ గన్’ను  రూపొందిస్తున్నారు. ఈ వారంలో జరుగనున్న కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో దీని ప్రీవ్యూను ప్రదర్శించాలని కూడా యోచిస్తున్నారు.