Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పొట్టలో పురుగులు పోవాలంటే..?

డాక్టర్ పావుశెట్టి శ్రీధర్
హోమియోఫిజీషియన్
హన్మకొండ, వరంగల్ జిల్లా

నేడు చామంది పొట్టలో ఏదో ఒకరకమైన క్రిములతో బాదపడుతున్నారు. ఏకకణ జీవులు మొదలుకుని నులిపురుగులు వరకు అనేకరకాలుగా ఉంటాయి. సాదారణంగా చిన్న పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అరుదుగా పెద్దల్లో కూడా కనిపిస్తుంటాయి. కొంతమందిలో నులిపురుగులు పడ్డ తర్వాత ఏళ్ల తరబడి బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించక పోవచ్చు అయితే దీర్ఘకాలికంగా కడుపులో పురుగులు       ఉన్నపుడు లక్షణాలు ఏవీ కనిపించక పోయినా వాళ్లకు అవసర మైన కొన్ని పోషకాలు అందకపోవడము ఫలితంగా బలహీనంగా కనిపించడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా చూడవచ్చును. 

కారణాలు:
nematodesకలుషితమైన ఆహరము తీసుకోవటం వలన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం.
పూర్తిగా ఉడకని మాంసము తినటం వలన
వ్యాప్తి : కలుషితమైన ఆహారం, నీటిద్వారా ఇవి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి.
లక్షణాలు :
మలద్వారం దగ్గర దురదగా ఉండును.
పళ్ళు రాత్రి పూట కొరుకుతూ ఉండటం.
ఎంత తిన్న కూడ బరువు పెరుగకపోవడం.
క్రమ క్రమంగా బరువు తగ్గిపోవడం
కడుపులో నొప్పి తరుచుగా రావడం
తిన్న ఆహరం సరిగా జీర్ణంకాకపోవడం
మానసికంగా, శారీరకంగా అస్థిమితంగా ఉండటం.
మలవిసర్జన అనంతరం చూసినట్లయితే చిన్న చిన్నగా పురుగులు అగుపడటం.
మలద్వారం, యోని మార్గం దగ్గర దురదలు
మలబద్దకం, వికారము వాంతులు, కడుపులో గ్యాస్ పెరుకున్నట్లు అనిపించడము
రాత్రి సరిగా నిద్ర పట్టకపోవటం, శరీరమంతా రక్తహీనత ఏర్పడటం
శారీరకంగానూ, మానసికంగానూ ఎదుగుదల లోపించడం జరుగును.
చర్మంపై దద్దుర్లు, చర్మం చిట్లినట్లు మారడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
తలనొప్పి మరియు ఒళ్లు నొప్పులు ఉండును.
జాగ్రత్తలు:
Nematodesపరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. సరిగ్గా ఉడికించిన ఆహారం తీసుకోవడము. ముఖ్యంగా మాంసము బాగా ఉడికిన తరువాత తీసుకోవాలి. పరిశుభ్రమైన నీళ్లుత్రాగడం, ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం, ఇంట్లోకి ఈగలు ఇతర పురుగులు రాకుండా చూడటం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా ఉంచుకోవడము. పిల్లలు నోటిలో చేతులు పెట్టుకోవడం, గోళ్లు కోరుకడం లాంటివి చేయనియ్యకపోవడము, బయట చిరు తిండ్లు మానివేయాలి. పురుగులు ఉన్నాయని అనుమానం వచ్చిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
చికిత్స : ఈ వైద్యవిధానములో పరాన్నజీవి కలిగించే లక్షణాలు మరియు రోగి లక్షణాలను, వ్యాప్తిని బట్టి మందులను సెలక్టుచేసి వాడాలి. మందులు రోగ నిరోధకశక్తిని క్రమబద్దీకరించి మళ్ళీ మళ్ళీ పురుగులు పునరుత్పత్తి కాకుండా చూడును.
మందులు
సీనా : చిన్నపిల్లలో పురుగులు ఉన్నట్టయితే వారిలో చికాకు, మొండితనం, మలధ్వారం దగ్గర దురదగా ఉండు ను, పాలిపోయిన చర్మం, నిద్రలో పళ్లు కొరకడము, కళ్ల చుట్టు నల్లని వలయాలు, నిద్రలో ఉలికిపడటం, ఆకలి బాగా ఉండి బరువు పెరుగక పోవడము, ఆస్‌కారిస్ జాతి పురుగులు ఉన్నపుడు ఈ మందును ఇవ్వవలెను. మానసిక స్థాయిలో వీరికి స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడుతారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది.
శాంటిస్ : గుదము దగ్గర దురద, పుండు, కడుపులో నొప్పి ఉన్నపుడు వాడవలెను.
ఫిలిక్స్‌మాస్ : బద్దె పురుగులున్న వారికి ఈ మందు బాగా పని చేయును. వీరికి కడుపులో నొప్పితో పాటుగా ముక్కు దగ్గరగా దురద ఎక్కువగా ఉండును. ఇలాంటి లక్షణాలకు ఫిలిక్స్‌మాస్ మంచి మందు.
టుక్రియంమారవ్‌ువీరవ్‌ు  గుదముదగ్గర దురద సాయంత్రం వేళలో ఎక్కువగా ఉండును, నిద్రలేమి ఉండును. ఆకలి వేళాపాళా లేకుండ ఉంటున్నప్పుడు ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును.
స్పెజీలయా: పాలిన ముఖం, కళ్లచుట్టు నీలవలయాలు, కడుపునొప్పి, మూర్చ ఉన్నపుడు వాడవలెను.
ఈ మందులే కాకుండ ఇంకా సబాడిల్లా, స్టానవ్‌ుమెట్, కుప్రంమొట్, కాల్కెరియా, నేట్రంఫాస్, సల్ఫర్ వంటి మందులను లక్షణసముదాయమును పరిగణలోకి తీసుకొని వైధ్యం చేసినయెడల పొట్టలో పురుగుల నుండి విముక్తి పొందవచ్చును.

Comments

comments