Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అలాంటి వారికి వంద శాతం నచ్చుతుంది

ritika-Singh

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవివి సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సినిమా సక్సెస్‌మీట్‌లో హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ “మా సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రేక్షకుల్లో రెండు రకాలుంటారు.

పది శాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తారు.  మిగిలిన 90 శాతం ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది”అని అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ “మా సినిమా టీం అందరికీ సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఎం.వి.వి.సత్యనారాయణతో కలిసి కొత్త తరహా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాం. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాలని ప్రారంభించిన మా ప్రయాణంలో  నిన్నుకోరి, నీవెవరో సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం”అని తెలిపారు. హరినాథ్ మాట్లాడుతూ “ఆది తన నటనతో కళ్యాణ్ అనే క్యారెక్టర్‌కు ప్రాణం పోశారు. తాప్సీ, రితికాసింగ్ చక్కగా నటించారు”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రితికాసింగ్,  సప్తగిరి, శివాజీరాజాతో పాటు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

comments