Search
Saturday 17 November 2018
  • :
  • :

అక్టోబర్ 6న ‘నేను కిడ్నాప్ అయ్యాను’

Nenu-Kidnap-Ayyanu

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, రఘుబాబు, కృష్ణ భగవాన్, పృథ్విల హాస్యం సినిమాలో మేజర్ హైలైట్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించే ఈ చిత్రానికి శ్రీకరబాబు దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత మాధవి అద్దంకి మాట్లాడుతూ “మా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను చూసి మెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీకరబాబు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. స్టార్ కమేడియన్లు బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, రఘుబాబు, కృష్ణబాబుల హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. అక్టోబర్ 6న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు శ్రీకరబాబు మాట్లాడుతూ “సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. నిర్మాత ఏమాత్రం రాజీపడకుండా సినిమాను నిర్మించారు. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే ఎంటర్‌టైనర్ మూవీ ఇది”అని తెలిపారు. కార్టూనిస్ట్ మల్లిక్, సత్య, కోట శంకరరావు, శ్రీకాంత్, ధీరేంద్ర, హర్ష కృష్ణమూర్తి, విశాల్, సౌమిత్రి, మహిమ కొఠారి, అదితి సింగ్, దీక్షిత పార్వతి, తేజు రెడ్డి, బిందు బార్బీ, సప్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేః దివాకర్‌బాబు, డైలాగ్స్‌ః మల్లిక్, మ్యూజిక్‌ః శ్రీకాంత్, లిరిక్స్‌ః గంగోత్రి విశ్వనాథ్.

Comments

comments