Home తాజా వార్తలు పక్షవాత రోగుల్లో నరాల మార్పిడి

పక్షవాత రోగుల్లో నరాల మార్పిడి

Nerve-transplantationప్యారిస్: పక్షవాత రోగులు తిరిగి తమకు తాము అన్ని పనులు చేసుకునేలా నరాల మార్పిడి శస్త్రచికిత్స చేసి ఆస్ట్రేలియా సర్జన్లు విజయం సాధించారు. వెన్నుముక గాయాలతో బాధపడుతూ పక్షవాతానికి గురైన 13 మంది యువకులకు నరాల మార్పిడి సర్జరీ చేసి సుదీర్ఘకాలం అనేక శస్త్రచికిత్సలు ఫిజియోథెరపీ చేయడంతో వారు తమకు తాము భుజించడం, ఎలెక్ట్రానిక్ వంటి సాథనాలను ఉపయోగించుకోవడం తదితర పనులు చేసుకోగలిగే స్థితికి చేరుకున్నారు.

వెన్నుముకకు ఎక్కడైతే గాయమయ్యిందో ఆ భాగానికి ఎగువనున్న నరాలను వేరు చేసి గాయం దగ్గర అతికించడంతో పక్షవాతానికి గురైన కండరాలు చైతన్యం పొంది ఆయా రోగులు యథాప్రకారం తమ పనులు తాము చేసుకునే స్థితిని పొందగలిగారు. ప్రతి నరం మార్పిడి శస్త్రచికిత్సకు రెండు గంటలు పట్టింది. ఆ విధంగా సర్జన్ల బృందం 59 ఆపరేషన్లు చేయగలిగింది. ఈ ప్రక్రియ పూర్తయిన రెండేళ్లకు ఆయా రోగులు తమ మోచేతులను కదిలించడం, మడవడం, ముడవడం, వస్తువులను పట్టుకోవడం, వంటి పనులు సులువుగా చేయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ అమలు లోకి వస్తే చాలా మంది పక్షవాత రోగులకు మేలు జరుగుతుంది.

Nerve transplantation for paralyzed patients