Search
Saturday 17 November 2018
  • :
  • :

షాకిచ్చిన ఎస్ బి ఐ

Net interest income of the bank stood at Rs 21,798 crore

క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టం
అంచనాలను మించి భారీ నష్టాలు నమోదు
ఎన్‌పిఎలకు కేటాయింపులు పెంచడమే కారణం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగానికి బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ వరుసగా మూడో త్రైమాసికం నష్టాలతో నిరుత్సాహపర్చింది. ఈసారి భారీ నష్టాన్ని ప్రకటించిం ది. 201819 ఆర్థిక సంవత్సరం జూన్ ముగింపు నాటి తొలి త్రైమాసికం(క్యూ1)లో ఎస్‌బిఐ నికర నష్టం రూ.4,876 కోట్లు నమోదు చేసింది. విశ్లేషకులు ఎస్‌బిఐ నష్టం రూ.171 కోట్లు ఉంటుందని అంచనా వేయగా, అంతకుమించి భారీ నష్టాలను మూటగట్టుకుంది. గతేడాది బ్యాంక్ రూ.2,006 కోట్ల లాభం ప్రకటించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.21,798 కోట్లుగా నమోదయ్యింది. స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) 10.69 శాతం నమోదవగా, గత త్రైమాసికంలో 10.91 శాతంగా ఉంది. అలాగే నికర ఎన్‌పిఎలు 5.29 శాతం నమోదవగా, అంతకుముందు త్రైమాసికంలో 5.73 శాతంగా ఉన్నాయి.

త్రైమాసికం పరంగా చూస్తే ఎన్‌పిఎలు స్వల్పంగా తగ్గాయి. కేటాయింపులు త్రైమాసికం పరంగా రూ.28,096 కోట్ల నుంచి రూ.19,228 కోట్లకు తగ్గాయి. అదే వార్షికంగా రూ.8,929 కోట్ల నుంచి రూ.19,228 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ ఇతర ఆదాయం రూ.6,679 కోట్లుగా ఉంది. గతేడాది జనవరిమార్చి త్రైమాసికంలో బ్యాంక్ నష్టం రూ.7,718 కోట్లుగా ఉంది. బ్యాంకింగ్ చట్టాల్లో మార్పు తర్వాత మొండి బకాయిలకు కేటాయింపులు పెంచిన నేపథ్యంలో ఎస్‌బిఐ నష్టాలను ప్రకటించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఎస్‌బిఐ షేరు విలువ 4 శాతం పడిపోయి రూ.304 వద్ద స్థిరపడింది.

నిలకడగా ఆస్తుల నాణ్యత : రెండు త్రైమాసికాల్లో క్షీణత తర్వాత జూన్ ముగింపు త్రైమాసికంలో ఎస్‌బిఐ ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంది. స్థూల ఎన్‌పిఎ 10.69 శాతం ఉండగా, అంతకుముందు మార్చి నాటి త్రైమాసికంలో స్థూల ఎన్‌పిఎ 10.9 శాతంగా ఉంది. నికర ఎన్‌పిఎ కూడా 5.73 శాతం నుంచి 5.29 శాతంతో స్వల్పంగా తగ్గింది.

Comments

comments