Home జోగులాంబ గద్వాల్ టిఆర్‌ఎస్ నేతలు అర్థరాత్రి వేళ నీళ్లు ఎలా వదులుతారు..?

టిఆర్‌ఎస్ నేతలు అర్థరాత్రి వేళ నీళ్లు ఎలా వదులుతారు..?

కృష్ణమోహన్‌రెడ్డిపై చర్చలు తీసుకోవాలి
సాగునీటి అధికారుల తీరుపై
ఎంఎల్‌ఎ డికె.అరుణ ధ్వజం

                    DK-Aruna

గద్వాలప్రతినిధి: నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద.. ప్రజల చేతిలో తిరస్కరించబడిన తెరాస నేతలు ఏ హోదాతో నీళ్లు వదులుతారని… పూర్తి సెక్కురిటీ జోన్‌గా ఉన్న గుడ్డెందొడ్డి లిఫ్టు వద్దకు కృష్ణమో హన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి అక్రమంగా వెళ్లి నీళ్లు వదులుతున్నట్లు ఫోటోలు ఫోజులిస్తుంటే సంబంధిత శాఖ అధికారులు ఏమి చేస్తున్నారని ఎమ్మేల్యే డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం అర్ధరాత్రి వేళ గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద చోటుచేసుకున్న సంఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుని కృష్ణమోహన్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మేల్యే డీకే అరుణ అన్నారు.

ఆదివారం ఎమ్మేల్యే డీకే అరుణ మనతెలంగాణతో ఫోన్‌లో మాట్లాడారు. జూరాలా ఆయకట్టుకు నీళ్లు వదలకుండా అక్రమంగా కోయిల్‌సాగర్, కొల్లాపూరు ప్రాంతాలకు నీళ్లను తరలించుకుని వెళ్లినపుడు నోరుమెదపని చేతకాని దద్దమ్మలు గద్వాల తెరాస నేతలు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కోయిల్‌సాగర్, కొల్లాపూర్ ప్రాంతాలకు నీటిని ఎలా తరలించుకు వెళ్తారు అని ప్రశ్నిస్తు… తాను జూరాలా ఆయకట్టుదారులతో కలిసి నీళ్లు వదలాలంటూ ఆందోళన చేసిన తరువాత ప్రభుత్వం దిగివచ్చిందని… ఈక్రమరంలోనే అధికారులు అర్ధరాత్రి పూట గుట్టుచప్పుడుగా నీళ్లను వదిలారని దుయ్యబట్టారు. ప్రజల చేతిలో తిరస్కరించబడిన కృష్ణమోహన్‌రెడ్డి గతంలో కూడ భూమి పూజలు చేయడం, నీటి విడుదల వంటి చర్యలకు పాల్పడ్డాడని ఇలాంటి చర్యలను అధికారులు కట్టడి చేయలేపోతే తమ కార్యకర్తలు కూడ ఇలాంటి చర్యలకు పాల్ప డాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అహ్రార్నిషలు కష్టపడి మేము నెట్టెంపాడు ప్రాజెక్టును సాధిస్తే… అందు లో నీళ్లు పారవు…. చెట్లు మొలకెత్తుతాయని ప్రగల్భాలు పలికిన వారు నేడు అంతా మేమే సాధించాం అన్న తరహాలో ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగడం హేయ్యమైన చర్య అని పేర్కోన్నారు. అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వాఖ్యానించారు. అధేవిధంగా ప్రొటోకాల్ పాటించని సంబంధిత సాగునీటి పారుదల శాఖ అధికారులపై కూడ చర్యలు తీసుకోవాలని ఎమ్మేల్యే డిమాండు చేశారు. ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటనలో కృష్ణమోహన్‌రెడ్డిపై కేసు కూడ నమోదు అయిందని అలాంటి వ్యక్తి ఇపుడు నెట్టెంపాడు మొత్తం నేనే సాధించాననే విధంగా ప్రవర్తించడం పనికిమాలిన చర్యగా పేర్కోన్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని ఎమ్మేల్యే డీకే అరుణ డిమాండు చేశారు.