Search
Monday 24 September 2018
  • :
  • :

అక్కడ గాలిని పిలిస్తే అంతే…

Moon

అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ప్రచురించిన తాజా అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలువడ్డాయి. చంద్రుడి మీద నుంచి తీసుకొచ్చిన మట్టి, రాళ్లను పరిశీలించిన పరిశోధకులు కొన్ని విషయాలను వెల్లడించారు. అక్కడ ప్రాణులు జీవించేందుకు ఆస్కారం ఉందా లేదా అన్న విషయంపై తాజాగా అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధనలో భాగంగా కొన్ని ఎలుకలపై చంద్రుడిపై ఉండే దుమ్ము, గాలి (లూనార్ డస్ట్)ని ప్రయోగించారు. ఈ ధూళిని పీల్చిన ఎలుకల్లో 90శాతం న్యూరాన్లు, ఊపిరితిత్తుల కణాలు చనిపోయినట్లు గుర్తించారు. చంద్రుడిపై ఉన్న ధూళి వల్ల డీఎన్‌ఏ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తేలింది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై అడుగుపెట్టే వ్యోమగాములు అక్కడి గాలిని పీల్చడం ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. 1972లో చంద్రుడి మీద అడుగుపెట్టిన వ్యోమగాము లు అక్కడి ధూళిని పీల్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. వారు వేసుకున్న సూట్లకు ధూళి అంటుకోవడంతో వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీకి చెందిన జెనిటిసిస్ట్ రాచెల్ క్యాస్టన్ తెలిపారు. ఈ క్రమంలో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు, అక్కడి ధూళిని పీల్చకుండా జాగ్రత్తలు పాటించాలని ఎక్కువ రోజులు ఉండటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

Comments

comments