Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చలామణిలోకి కొత్త.. రూ.200, రూ.50 నోట్లు

New-200-Notes

ముంబయి : భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన రూ.200, రూ.50 నోట్లు శుక్రవారం నుంచి చలామణిలోకి వచ్చాయి. ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేదికగా కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా కొత్త నోట్లను అందుకొనేందుకు బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులుతీరారు. ఈ నోట్లు అందిన కొంతమంది వాటితో సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. గతేడాది పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం వాటి స్థానంలో రూ.2వేలు, కొత్త రూ.500ల నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ కొత్త రూ.200, రూ.50 నోట్లను అంధులు కూడా గుర్తించే విధంగా రూపొందించారు.

Comments

comments