Search
Saturday 17 November 2018
  • :
  • :

జిల్లాకు వరాల జల్లు

New bus stand is acceptable to the airport for Rs 250 crore

ఎంపి కవిత, ఎంఎల్‌ఎ బిగాల వినతికి స్పందించిన కెటిఆర్
విమానాశ్రయానికి ఓకే 8 రూ.250 కోట్లతో నూతన బస్టాండ్‌కు అంగీకారం
ఇంటిగ్రేటెడ్ స్టేడియం, మహిళా స్టేడియంకు గ్రీన్‌సిగ్నల్                                                                                              ఆర్మూర్‌లో ఆహారశుద్ధి కర్మాగారం                                                                                                                        నూతన లైబ్రరీకి సైతం అనుకూలం

మన తెలంగాణ/నిజామాబాద్: నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాకు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరాలజల్లును కురిపించారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నఆయన అర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్‌గుప్త, ఎంపి కల్వకుంట్ల కవిత చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. ముందుగా ఘనస్వాగతం పలికిన ఎంఎల్‌ఎ నగరానికి ఏటా వందకోట్ల నిధులు ఇవ్వడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న భూగర్భ, మురికి కాలువల నిర్మాణానికి రూ.171 కోట్లు ఖర్చువుతుండగా మరో రూ.10 కోట్లు అవసరమని మంత్రిని కోరారు. రూ.50 కోట్లతో ప్రతిష్టాత్మకంగా ఐటి హబ్‌ను ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని హబ్ పూర్తి కావడానికి మరో 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని మంత్రిని కోరారు. అనంతరం మాట్లాడిన ఎంపి కవిత సైతం పలు డిమాండ్లను మంత్రి కెటిఆర్ ముందు ఉంచారు.

ఎంపి, ఎంఎల్‌ఎ చేసిన వినతి మేరకు నిజామాబాద్ నగరంలో రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ బస్‌స్టాండ్ నిర్మాణంతో పాటు ఆధునిక వసతులతో కూడిన స్టేడియం, మహిళల కోసం ప్రత్యేక మైదానాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపి కవిత కోరిక మేరకు మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆహారపదార్థాల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బాల్కొండలో స్పైస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన విమానాశ్రయాన్ని సైతం త్వరలోనే జక్రాన్‌పల్లిలో ఏర్పాటు అయ్యేలా చూస్తామని మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు. నిజామాబాద్ నగరానికి గత మూడేళ్లలో రూ.400 కోట్లను ఇవ్వడాన్ని మంత్రి గుర్తు చేశారు.

నగరంలో ఏర్పాటు చేస్తున్న ఐటి హబ్ కెసిఆర్ కలలు కన్న తెలంగాణ ఏర్పాటులో భాగమని కెటిఆర్ చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలోను పారిశ్రామిక ఐటి విధానాలను విస్తరిస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్ జిల్లాలో అపారమైన విజ్ఞాన సంపద ఉందని అందుకు రెడ్‌బస్ లాంటి సంస్థలను నెలకొల్పిన ఫణి లాంటి మేధావులే ఉదాహరణగా గుర్తు చేశారు. ఫణిని తెలంగాణ ఐటి రంగంలో పలు సేవలకు సిఇఓగా వినియోగించుకుంటున్నట్లు చెప్పిన కెటిఆర్ మరింత మంది తెలంగాణ యువత కొత్త ఆవిష్కరణలు జరిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిజామాబాద్ ఐటి హబ్ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 40 ప్రముఖ కంపెనీలు పెట్టుబడుల కోసం ముందుకు రాగా బుధవారం వేదిక మీద మరో 12 కంపెనీలు ఎంఓయు కుదుర్చుకున్నాయి.

Comments

comments