Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌లో కొత్త సిఎం?

Gujarat-image

అహ్మదాబాద్ :  బిజెపి నూతన ప్రభుత్వం ఈనెల 25న కొలువుదీరే అవకాశముంది. బొటాబిటీ మెజార్టీతో విజయం సాధించిన రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బిజెపి కసరత్తులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌ల నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని ప్రచారంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికలను మోడీ సారథ్యంలోనే ఎదుర్కొన్నారు. ‘ఈసారి తక్కువ మెజార్టీతో గెలిచినందున, ముఖ్యమంత్రిని మార్చాలని పార్టీ యోచిస్తోంది’ అని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, మోడీ, పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయాన్ని తీసుకుంటారని వెల్లడించాయి. ఈ విషయమై సిఎం రూపానిని ప్రశ్నించగా…ఈ ఎన్నికల్లో పార్టీ తన నేతృత్వంలోనే పోరాడిందని, అయితే తుది నిర్ణయం మోడీ, పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు  తీసుకుంటాయని చెప్పారు. 182 స్థానాలు కలిగిన అసెంబ్లీలో బిజెపి 99 మంది అభ్యర్థులను గెల్చుకుంది. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కనీసం 92 సీట్లు అవసరం కాగా, అదనంగా కేవలం ఏడు సీట్లను మాత్రమే సాధించింది. ఇదే సమయంలో కాంగ్రెస్, తన భాగస్వామ్య పక్షాలతో కలిసి 80 స్థానాలను గెల్చుకుంది. డిసెంబరు 25న  వాజపేయి జన్మదినం కావడంతో అదే రోజు నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

Comments

comments