Home రాష్ట్ర వార్తలు కొత్త కలెక్టరేట్లకు వసతులు

కొత్త కలెక్టరేట్లకు వసతులు

నేడు సచివాలయంలో కలెక్టర్ల భేటీ, కొత్త జిల్లాలకు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ

secహైదరాబాద్ : కొత్త జిల్లాల కలెక్టరేట్లకు భవనాలు, సిబ్బంది, వాహనాలు, రవాణ సదుపాయం అనే ప్రధాన అంశాలపై జిల్లా కలెక్టర్ల సమావేశం చర్చించనుంది. ప్రస్తు త కలెక్టరేట్‌లో ఎంత మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, వాహ నాలు ఎన్ని ఉన్నాయి అనేదానిపై జిల్లా కలెక్టర్లు నివేదిక అందచేయనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు, సంబంధిత అంశాలపై సచివాలయం లో సోమవారం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీ వ్ శర్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరు గనున్నది. ఈ సమావేశంలో జిల్లాల సంఖ్యపై స్పష్టత రానున్నది. ఈనెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం నగరం లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభి వృద్ధి కేంద్రం (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి)లో జరిగింది. తొలిరోజు సమావేశాన్ని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.రేమం డ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా నేతృత్వంలో జరిగింది. జిల్లాల విభజన, చిత్రపటాలు, మండలాల పునర్వి భజన తదితర అంశాలపై కలెక్టర్లు పవర్‌పా యింట్ ప్రజంటేషన్ ఇచ్చిన విషయం తెలి సిందే. రెండో రోజు సమావేశంలో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. మూస పద్ధతిలో కాకుండా శాస్త్రీ యంగా జిల్లాల విభజన జరగాలని, యాదగిరి గుట్ట పరిధి పెంచాలని, కొత్తగా సిరిసిల్ల జిల్లాను ప్రతిపాదించాలని ఈ సమావేశంలో అధికారులకు మార్గదర్శనం చేశారు.
భవనాలు, రోడ్డు సౌకర్యాలపై ప్రతిపాదనలు
కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా కలెక్టరేట్లకు భవనాలు ఎన్ని అందుబాటు లో ఉన్నాయి, అదనంగా ఎన్ని సమకూర్చుకోవాలి, రోడ్డు సౌకర్యం ఎలా ఉందనే దానిపై జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు అందజేయనున్నారు. రాష్ట్రం లో ప్రస్తుతం పది జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నా యి. హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లు ఇరుకైన భవనాల్లో ఉన్నాయి. ఆర్‌డిఒ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో కొత్త జిల్లాలు వస్తున్నందున అక్క డే జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. అవి లేని ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకుంటారు. ప్రజలు రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్డు సౌకర్యం ఉందా, ఒకవేళ ఉన్నట్లయితే సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు ఉందా అనేది తెలుసుకుంటారు. సింగిల్ రోడ్డు ఉన్నట్లయితే డబుల్ రోడ్డు వేయాలని ప్రతిపాదిస్తారు. కొత్త జిల్లాలకు భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.150 కోట్లు కేటాయించాలనే ఆలోచనలో సిఎం కెసిఆర్ ఉన్నారు. ఈ నిధులలతో కలెక్టరేట్ ప్రాంగణంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. శాశ్వత కార్యాలయ సముదాయం నిర్మాణం కోసం అవసరమైన స్థలాల వివరాలను కూడా ఈ సమావేశంలో అందజేయనున్నారు.
ప్రతి కలెక్టరేట్‌లో ఐదు సెక్షన్లు!
ప్రస్తుతం ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో ఐదు సెక్షన్లు సరిపోతాయని భావిస్తున్నారు. ఒక్కో సెక్షన్‌కు డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారి సెక్షన్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి పరిధిలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిసెంట్లు పనిచేస్తారు. ప్రతి సెక్షన్‌కు కొన్ని సబ్జెక్టులను అప్పగిస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే కలెక్టరేట్లలో ఎనిమిది సెక్షన్లు అవసరం లేదనేది జిల్లా కలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఎనిమిది స్థానంలో ఐదు ఏర్పాటు చేస్తే సరిపోతుందనేది సూచించనున్నారు. ఏ సెక్షన్ పరిధిలో ఎన్ని సబ్జెక్టులు ఉండాలి, ఎంత మంది పనిచేయాలనేది తెలియజేస్తారు. అలాగే 300 మంది సిబ్బంది బదులు 200 మందికి పరిమితం చేస్తారు. ప్రతి కలెక్టరేట్‌లో ప్రస్తుతం 300 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున సిబ్బంది సంఖ్య తగ్గిస్తున్నట్లు సమాచారం. ఐటి పరిజ్ఞానం ఉన్నవారిని నియమించుకోవాలని సూచన చేసే అవకాశం ఉంది. అలాగే మిగులు సిబ్బంది ఎంత మంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా సర్దుబాటు చేయలనేది వివరాలు అందచేయనున్నారు.
పేరు ఒకటి, జిల్లా కలెక్టరేట్ మరో చోట
పేరు ఒకటి పెట్టి, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మరో చోట ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తికమకకు గురయ్యే ప్రమాదముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, భద్రాచలం శ్రీ రామచంద్రస్వామి, హైదరాబాద్‌లో గోల్కొండ కోట పేరు మీద కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. యాదగిరిగుట్టలో కాకుండా రాయగిరి లేదా భువనగరిలో జిల్లా కేంద్రాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అలాగే భద్రాచలం జిల్లాను ప్రకటించి అక్కడ కాకుండా కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారవర్గాల కథనం. హైదరాబాద్‌లో పశ్చిమ ప్రాంతాన్ని గోల్కొండ జిల్లాగా ఖరారు చేసి వేరే ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ప్రజల్లో అయోమయం నెలకొంటుందని, ఏ పేరుతో ప్రతిపాదిస్తే ఆ చోటే జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే సముచితంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.