Search
Wednesday 21 November 2018
  • :
  • :

కొత్తకాలనీ సమస్యలు చూడతరమా!?

  • డ్రైనేజీలు లేక అస్తవ్యస్థం
  • పందుల స్వైరవిహారం
  • జ్వరాల భారిన ప్రజలు
  • వెలగని వీధి దీపాలు
  • నీళ్లురావు, వచ్చినా నిలవని మినీ వాటర్ ట్యాంక్
  • పట్టించుకోని అధికారులు

Colony-Problems-Bhadrachalaభద్రాచలం : పట్టణంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీలో పలువీధులలో ఎటు చూచిన  అపరిశుభ్రత తాండవిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీలోని పలు వీధులలో డ్రైనేజీలు లేక, ఉన్నవి కూడా సరిగా పనిచేయక అన్ని మురికి గుంటలుగా ఏర్పడి ఎక్కడ చూచినా పందులకు నిలయాలుగా మారుతున్నాయి. ఆ మురికి గుంటలలో దోమలు, ఈగలు కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయి. ఆ దోమలు మూలంగా  డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి పలు రకాల విష జ్వరాల భారిన పడుతున్నారు. ఈగలు వాలటం వలన కలరా, మచూచి, డయేరియా వంటి పలు రకాల రోగాల సోకే అవకాశం ఉంది. స్వచ్చభారత్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు స్వచ్చతపై దృష్ఠి సారించాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు వెలగక రాత్రిళ్ళు పాదాచారులు ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. అసలే వర్షాలు కురిసి రోడ్లు గుంతలుగా ఏర్పడ్డాయి. రాత్రి పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే ప్రజలు వీధి దీపాలు లేక గుంతలలో పడి, గాయాల పాలవుతున్నారు. కొత్త కాలనీ సెంటర్లో ఉన్న మిని వాటర్ ట్యాంక్ శిధిలావస్తలో ఉంది. దానిని పునఃనిర్మించాలని, నీళ్ళు రాకా వచ్చినా నిలవక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయితీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని కాలనీ ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, కాలనీల్లో డ్రైనేజీలలో పూడుకుపోయిన చెత్తను తొలగించి, దోమల నివారణకు చర్యలు తీసుకుని,బ్లీచింగ్ చల్లించాలని, డ్రైనేజీలు లేని చోటు కోత్త డ్రైనేజీలు నిర్మించి. వీధి దీపాలు వెలిగేలా చూడాలని, వాటర్ ట్యాంక్‌ని పునఃనిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
పిల్లలు జ్వరాల భారిన పడుతున్నారు: ఇక్కడి పిల్లలంతా జ్వరాల భారిన పడుతున్నారు. చెత్తా చెదారం నిండిపోవడంతో ఎక్కడ చూసినా దోమల మోతే. అవి పిల్లలను కుట్టడంతో జ్వరాలు వస్తున్నాయి. జ్వరం సోకిన వాళ్లు ఇంటికోక్కరు ఉన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించండి
పందులతో తంట: ఇళ్ల చుట్టూ పందులే. బురద మడుగులు చేసిన అందులోనే దోర్లుతున్నాయి. పందుల వల్ల దుర్ఘంధం వస్తోంది. నేరుగా ఇళ్లలోనికి వచ్చి ఇబ్బందులు పెడుతు న్నాయి.వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ పాముల బెడిద ఎక్కువైంది.

Comments

comments