Home యాదాద్రి భువనగిరి 2016 కొత్త ‘జిల్లా’ రాజకీయం

2016 కొత్త ‘జిల్లా’ రాజకీయం

ప్రణాళికలకే పరిమితమై పార్టీలు

party

యాదాద్రిభువనగిరిటౌన్: నూతనంగా ఏర్పడిన యాదాద్రిభువనగిరి జిల్లా రాజకీయ పరిణా మాలు సంస్థాగత నిర్మాణాలతో 2016 గడిచిపోతుంది. అధికార పార్టీలో నామినేటేడ్ పదవుల ఆశలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల ఉద్యమాలు, కాంగ్రెస్, బిజెపి పట్టు కోసం సమస్యలపై ఆందోళనలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నామినేటేడ్ పదవులు మొదలుపెట్టడంతో అధికార పార్టీలోని నాయకులు ఎవరి ప్రయత్నాలు వా రు చేసినప్పటికి ఒకటిరెండు తప్ప పూర్తిస్థాయిలో నియ మా కాలు జరుగలేదు. కాంగ్రెస్ పార్టీ కమిటీ పిలుపు మేరకు పట్టుకోసం ఆందోళనలు చేపట్టింది. వామపక్ష పార్టీలు, బిజెపి డబుల్‌బెడ్‌రూం, ఇళ్లస్థలాలు, పెన్షన్లతో పా టు అసంఘటిత కార్మికుల సమస్యలపై ఉద్యమాలు చేపట్టారు. ఇక టిడిపి అఖిలపక్ష పార్టీలతో కలిసి యాదాద్రిభువనగిరి జిల్లా ఏర్పాటుకోసం ఉద్యమాలు చేపట్టారు. జిల్లా ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీలు కార్యాచరణ ప్రణాళికలకే పరిమితమయ్యాయి.

కార్మిక, రైతాంగ సమస్యలపై వామపక్షలు
జిల్లాలో సిపిఐ, సిపిఎంలు సంఘటిత, అసంఘటిత కా ర్మికులు, రైతాంగ సమస్యలపై, జిల్లాలోని పరిశ్ర మల్లోని కార్మికులతో పాటు అంగన్‌వాడీ, మున్సిపాల్టీ, గ్రామ పం చాయతీ, 2వ ఏఎన్‌ఎం, వ్యవసాయ కార్మికుల సమ స్యలపై ఉద్యమాలు సాగించారు. ఉమ్మడి నిర్మాణ మహా సభ లకు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజర య్యారు. జిల్లా కార్యదర్శిగా యాదగిరిగుట్టకు చెందిన గో ద శ్రీరాములు ఎన్నికయ్యారు. సిపిఎం పార్టీ యా దా ద్రి జిల్లా కార్యదర్శిగా ఎండి జహంగీర్ ఎన్నికయ్యారు.

ఆశలు… నిరాశలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నామినేటేడ్ పదవుల పందేరం ప్రారంభించడంతో యాదాద్రిభువనగిరి జిల్లా లోని అధికార పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లాలోని మార్కెట్‌కమిటీలు, ఆలయకమిటీలపై ఆశలు పెంచుకున్నప్పటికి పదవులు ఆశించినస్థాయిలో దక్కకపోవడంతో నేతల ఆశలు నిరాశలే అయ్యాయి. ప్ర భుత్వం నామినేటేడ్ చేసిన రాష్ట్రస్థాయి పదవుల్లో మో త్కూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన మందుల సామేల్‌కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ పదవి దక్కింది. మా ర్కెట్ పాలకవర్గాలకు ఇప్పటివరకు ఆలేరు, మో త్కూరు, వలిగొండ మార్కెట్ల నియమాకాలు జరిగాయి. భువనగిరి, చౌటుప్పల్ పాలకవర్గాలకు నియమాకాలు జరిగాయి.

కాంగ్రెస్ పట్టుకోసం ఆందోళన
కాంగ్రెస్ పార్టీ పట్టుకోసం ప్రభుత్వ వ్యతిరేక విధానలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు రుణ మాఫీపై ధరఖాస్తుల స్వీకరణలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి పాల్గొన్నారు. కొత్తజిల్లాలకు డిసిసి అధ్యక్ష నియమా కాలు జరుగకపోవడంతో యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన బూడిద బిక్షమయ్యగౌడ్, ఉమ్మడిజిల్లా డిసిసి భాద్యతలు నిర్వహిస్తున్నారు.