హైదరాబాద్ : ఫేస్బుక్లో ఎమోజీలు బాగా వాడేస్తున్నారా! భావం అదే అయిన రోజూ అవే ఎమోజీలను చూసి విసుగుచెందుతున్నారా. స్నేహితుల పోస్టులను ఎప్పటికప్పుడు సరికొత్త ఎమోజీలతో లైక్ చేయాలనుకుంటున్నారా. అయితే మీకోసమే ఈ యాడ్-ఆన్. www.reactionpacks.com వెబ్సైట్లో లభించే ఎమోజీలను మార్చుకోవచ్చు. ఫైర్ఫాక్స్, క్రోమ్ బ్రౌజర్లకు మద్దతుగా వెబ్సైట్లో యాడ్-ఆన్ లభిస్తుంది. ప్రస్తుతం ట్రెడింగ్లో అమెరికా అధ్యక్షపదవికి పోటీలో వున్న డోనాల్డ్ట్రంప్ ప్రముఖ వీడియోగేమ్ పోక్మాన్ ఎమోజీలతో పాటు మరెన్నో అందుబాటులో వున్నాయి.