Search
Wednesday 14 November 2018
  • :
  • :

నెయిల్ ఆర్ట్

Nails-Beautyఇప్పుడు నెయిల్ ఆర్ట్ ఫ్యాషన్‌కు క్రేజ్ ఉంది. ఇంతకుముందువరకు మహిళలు గోళ్ళకు నెయిల్ పాలిష్, గోరింటాకు మాత్రమే పెట్టుకునేవారు. కాని ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్ వల్ల గోళ్ళపై విభిన్నమైన చిత్రాలను చిత్రీకరించుకోవచ్చు. బ్యూటి క్లినిక్‌లలో వీటికోసం ప్రత్యేకంగా నిపుణులు కూడా ఉన్నారు. పాతకాలంలోనే ఇలాంటివి ఉన్నా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చి అందరినీ ఆకర్షిస్తున్నాయి. గోళ్ళనే చిన్నకాన్వాస్‌లుగా ఉపయోగించుకుని అనేక రకాల చిత్రాలను చిత్రీకరిస్తున్నారు. రంగురాళ్ళు, డైమండ్‌లను వీటిపై అందంగా పేర్చి గోటికి అదనపు హంగులను కల్పించి ఎంతో ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ గోళ్ళను కూడా తయారు చేస్తున్నారు. అందంగా అలంకరించడమే కాకుండా అందుకు రింగులు, చెయిన్స్ కూడా తగిలిస్తున్నారు. నెయిల్‌కు బంగారు, వెండి రంగులను అద్దుకుంటే అవి మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తాయి.

Comments

comments