Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పవన్-త్రివిక్రమ్ సినిమా షురూ

Pawanపవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ వేడుకలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, ఎస్.రాధాకృష్ణ, శరత్ మరా, సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ “పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం మా సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకమైంది. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారు. వీరితో పాటు ఇతర ప్రముఖ తారాగణం ఎంపిక కాగానే త్వరలో ప్రకటించడం జరుగుతుంది”అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: వి.మణికందన్,  సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: చంటి, సమర్పణ: శ్రీమతి మమత.

Comments

comments