Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నయా గాడ్జెట్స్

అతి చిన్న పీసీ

ng

ఎలైట్ గ్రూప్ కంప్యూటర్ సిస్టమ్స్ (ఈసీఎస్) సంస్థ ‘లివా క్యూ’ పేరిట ప్రపంచంలో అత్యంత చిన్నదైన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మినీ పిసీని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కంప్యూటర్ బరువు కేవలం 260 గ్రాములు మాత్రమే ఉంటుంది. దీనిలో ఇంటెల్ అపోలో లేక్ ప్రాసెసర్లు, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఓఎస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, ఒక ఈథర్‌నెట్ పోర్టు ఉన్నాయి. దీనిలో వెసా మౌంట్ పోర్టును ఏర్పాటు చేశారు. ఈ పీసీని మానిటర్లు, టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ 10 ఓఎస్ లేకుండా అయితే ఈ మినీ పీసీ రూ.13,500 ధరకు లభిస్తుంది. అదే విండోస్ 10 ఓఎస్ కావాలనుకుంటే ఈ పీసీని రూ.15,500 ధరకు కొనుగోలు చేయవచ్చు.ఈ మినీ పీసీ త్వరలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభ్యం కానుందని ఎలైట్ గ్రూప్ సంస్థ తెలిపారు.

gardget

షియోమీ యెల్లైట్ నుంచి సరికొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. స్మార్ట్ హౌం ప్రొడక్ట్  యెల్లైట్ వాయిస్ అసిస్టెంట్ ఆధారిత స్మార్ట్ స్పీకర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. యెల్లైట్ అసిస్టెంట్‌లోని ఫీచర్లు… ఈ స్మార్ట్ స్పీకర్ పైభాగంలో నాలుగు బటన్స్ ఇచ్చారు. యాక్షన్ బటన్, మైక్రో బటన్ ఆఫ్‌ఆన్, వాల్యూమ్ అప్ బటన్. వాల్యూమ్ డౌన్ బటన్, ఎకో డాట్ మాదిరిగా ఉంటుంది. ఈ డివైస్ అడ్వాన్స్ వాయిస్-వేక్ ఆల్గోరిథంలో సెట్ చేశారు. ఇది 5మీటర్ల పరిధిలో ఉన్న డివైజ్ టర్న్ చేయగలదు. బీమఫార్మింగ్ టెక్నాలజీతో వాయిస్ కంట్రోలింగ్ ఉంటుంది. స్మార్ట్ స్పీకర్ 64బిట్ కార్టెక్స్ A53క్వాడ్ కోర్ ప్రొసెసర్ ద్వారా రన్ అవుతోంది. 1.2గిగా వద్ద క్లాక్, 256ఎంబి ర్యామ్, 256ఎంబి ఫ్లాష్ స్టోరేజితో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ డివైస్ 2.4గిగా 5గిగా డ్యూయల్ బాండ్ , వై-ఫై, బ్లూటూత్ తో అందుబాటులోకి వస్తుంది. యెల్లైట్ వాయిస్ అసిస్టెంట్ డ్యుయల్ ఎస్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇంట్లోని స్మార్ట్ బల్బులు, బెడ్ లైట్స్, సీలింగ్ లైట్స్ వంటి ఇతర ప్రొడకట్స్‌ను నియంత్రించేలా ఈ   డివైజ్‌ను  రూపొందించారు. ఈ స్మార్ట్ స్పీకర్ ధరను ప్రస్తుతం 1,950గా నిర్ణ యించినా అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదని నిర్వాహకులంటున్నారు.

Comments

comments