Home రంగారెడ్డి అభివృద్ధి కోసమే నూతన గ్రామ పంచాయతీలు

అభివృద్ధి కోసమే నూతన గ్రామ పంచాయతీలు

 New gram panchayats

మన తెలంగాణ/కడ్తాల్ : మండలంలో నూతనంగా ఏర్పడ్డ పంచాయతీల ప్రారంభోత్సవ వేడుకలను గురువారం ఆయా గ్రామపంచాయతీల్లో ఘనంగా ని ర్వహించారు. ప్రారంభోత్సవ వేడుకలకు ఎంఎల్‌ఎ చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎంఎల్‌సి కసిరెడ్డి నారయణరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు జైపాల్‌యాదవ్, ఎడ్మ కిష్టారెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బాలాజిసింగ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, విజితారెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షుడు జర్పుల దశరథ్‌నాయక్, పిసిసి సభ్యుడు అయిల్ల శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు పలువురు నాయకులు, గ్రామప్రజలు, ప్రత్యేకాధికారులు హాజరయ్యారు. మండలంలో నూతనంగా ఏర్పడ్డ అన్మాస్‌పల్లి, గానుగుమర్ల తండా, గోవిందాయపల్లి, గోవిందాయపల్లి తండా, మర్రిపల్లి, గడ్డమీది తండా, నార్లకుంట తండా, పెద్దవేములోని బావి తండా, రేఖ్య తండా, కొండ్రిగానిబోడి తండా, న్యామంతాపూర్, పల్లె చెలుక తండాలలో పంచాయతీ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లో నూతన పంచాయతీ కార్యాలయాలను స్థానికులు అందంగా, శోభాయమానంగా ముస్తాబు చేసి అలంకరించారు. బాలాజీ నగర్ తండా, రేఖ్యతండా, కొండ్రిగాని బోడి తండా, గానుగుమర్ల తండాల్లో నూతన పంచాయతీ ప్రారంభోత్సవాల సందర్భంగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయా కార్యక్రమాల్లో ఎంపిటిసిలు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఉపసర్పంచ్‌లు, మాజీ వార్డుసభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు, యువకులు పాల్గొన్నారు.
* మహేశ్వరంలో… గ్రామీణ ప్రాంతాలు ఆర్దికంగా అభివృద్ధ్ది చెందాలనే ల క్షంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదువందల జనాభా కలిగిన గిరిజన తాండాలను శి వారు అనుబంధ గ్రామాలను కలుపుతూ కొత్త గ్రామపంచాయితీలుగా ఏర్పా టు చేసిందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. గురువారం తు క్కుగూడ పురపాలక సంఘం కార్యాలయంతో పాటు మొహబత్‌నగర్ గంగా రం ఎన్‌డి తాండ కెసితాండ రామచంద్రగూడ హబీబుల్లగూడ గ్రామాలలో నూతన గ్రామపంచాయితీ కార్యాలయాలను ప్రారంభించారు. హరిత హారం లో భాగంగా మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ని రావిరాల సర్దార్‌నగర్ తుక్కుగూడ మంఖాల్ గ్రామపంచాయితీలు వాటి అనుబంధ గ్రామాలను కలుపుతూ తుక్కుగూడ పురపాలక సంఘం ఏర్పాటు జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పిటిసి ఎన్ ఈశ్వర్‌నాయక్ తుక్కుగూ డ పురపాలక సంఘం ప్రత్యేకాధికారి ఆర్డిఓ రవీందర్‌రెడ్డి ఇంచార్జీ కమీషనర్ తెన్మోజి ఎండిఓ బి.నీరజ రావిరాల మంఖాల్ తుక్కుగూడ సర్దార్‌నగర్ మాజీ సర్పంచులు జె.లక్ష్మయ్య ఎ.కౌసల్య డి.సుధాకర్ టి.రాకేష్‌గౌడ్ టిఆర్‌ఎస్ నాయకులు టి.అనితారెడ్డి హెచ్ చంద్రయ్య కూనయాదయ్య ఎం.కరుణాకర్‌రెడ్డి పి.రాఘవేందర్‌రెడ్డి యు.శ్రీనివాస్ ఎ.రాజునాయక్. ఎకృష్ణానాయక్ సురేష్ ఎంపిటిసి టి.యాదిష్ తదితరులు పాల్గొన్నారు.
* ధారూర్‌లో… గత పాలకుల హయాంలో ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధ్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలు స్వరాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు తీయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల జనాభా గల ప్రతి తండాతో పాటు అనుబంధ గ్రామాలను నూతన గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్ధేశంతోనే నూతన గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని టిఆర్‌యస్ మండల పార్టీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్ రెడ్డి అన్నారు .గురువారం ఉదయం ధారూర్ మండలంలోని మోమిన్ ఖుర్ధు, దర్మాపూర్,అంపల్లి ,రాజపురం ,పిసియం తండాలను వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం నాల్గవ విడుత హరిహారం కార్యక్రమంలో భాగంగా మోమిన్ ఖుర్ధు గ్రామంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో,యంఆర్ ఓ భీమయ్య గౌడ్ ,యంపిడిఓ సబిత,ఎపిఓ సురేష్ కుమార్,టిఆర్‌యస్ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి , పిఎసియస్ చేర్మెన్ హన్మంత్ రెడ్డి,మార్కెట్ కమిటి చేర్మెన్ రాజూనాయక్, రైతు సమన్వమ సమితి కోఆర్డి నేటర్ రాంరెడ్డి, యంపిటిసి మునీరాబేగం, కోఆప్షన్ సభ్యుడు హఫీజ్ ఖురేషి ,ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య, ఉప సర్పంచ్ యూనీస్,నాయకులు రాజూగుప్త, సీతాగారి లక్ష్మయ్య, రాములు ఆయా గ్రామాల పంచాయితీ సెక్రేటర్ లు పూర్ణి మా, సునిత,సూరిబాబు, అనురాధా, విఆర్‌ఓలు భూపాల్ ,గిరిదర్,గోపాల్ ,శ్రీశైలం గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
* పరిగిలో… పరిగి మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారండంతో త్వరలో మరింత అభివృద్ధ్ది చెందబోతోందని ఇందుకు సహాయ సహకారాలు అందిస్తానని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పరిగి మేజర్ గ్రామ పంచాయతీని గురువారం పరిగి మున్సిపాలిటీగా మార్చుతూ ము న్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్దిపథంలో దూసుకుపోతున్న పరిగి పట్టణం మరింత అభివృద్ధి చెందనుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ సర్పంచ్ అంతిగారి విజయమాల, మాజీ ఉప సర్పంచ్ ఎదిరె పద్మ, నాయకుల రొయ్యల ఆంజనేయులు, ఎంపీటీసీ సమ్మద్, నాయకులు అంతిగారి సురేంద ర్‌కుమార్, నాయకులు నారాయణరెడ్డి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, బషీర్, తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా పరిగి మండల పరిధిలో రంగాపూర్, రుక్కుంపల్లి, రావులపల్లి, లఖ్నాపూర్, యాబాజిగూడ, పేటమాదారం, హీర్యానాయక్‌తండా, మల్కాయపేట్ తండా, రూప్‌సింగ్ తండా తదితర నూతన గ్రామ పంచాయతీయలు ఏర్పాటు చేస్తూ, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. రంగాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి జిల్లా రైతు సమన్వయ సమితి క-ఆర్డినేటర్ కొప్పుల మహేష్‌రెడ్డి కార్యాలయాన్ని ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు మాజీ సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
* ఆమనగల్లులో… ఆమనగల్లు గ్రామపంచాయితీ మున్సిపాలిటీగా ఏర్పడిం ది. ఆమనగల్లు, విఠాయిపల్లి గ్రామపంచాయితీలను కలిపి ప్రభుత్వం మున్సి పాలిటీగా ఏర్పాటు చేసింది.మున్సిపాలిటి ఆవిర్భావ కార్యక్రమాన్ని గురువా రం అట్టహాసంగా నిర్వహించారు. ప్రత్యేక అధికారి సిహెచ్ రవీందర్‌రెడ్డి, ఇం చార్జీ కమిషనర్ ఎల్.రామ్మోహన్,ఎంపీపీ తల్లోజు లలితవెంకటయ్య, జడ్పీటీసీ కండె హరిప్రసాద్, రైతు సమన్వయ సమితీ కన్వీనర్ పోనుగోటి అర్జున్‌రావు, వైస్ ఎంపీపీ నిట్టనారాయణ,ఎంపీడీఓ వెంకట్రాములుతో కలిసి ఎమ్మెల్సీ క సిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజాభీష్టానికి అనుగుణంగా మున్సి పాలిటీ తీర్చిదిద్ధుతామన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు నేనావత్ పత్యనాయక్, సుండూరు ఝాన్సీరాణిశేఖర్, మాజీ సర్పంచ్ గుర్రం కరుణశ్రీకేశవులు, ఉపసర్పంచ్ కండె కళావతి, నాయకులు వస్పుల జంగయ్య తదితరులున్నారు.
గ్రామాల సౌలభ్యం కోసం పంచాయతీల ఏర్పాటు
నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం
షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
* షాద్‌నగర్‌లో… గ్రామాల సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యాదవ్ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీ భవనాలను ప్రారంభోత్సవంలో భాగంగా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చౌడమ్మగుట్ట తండా, చిన్నచిల్కమర్రి, రామేశ్వరం, పుచ్చర్లకుంటతండా, గిరాయిగుట్ట తండా, ఉప్పరిగడ్డలను ఎమ్మెల్యే, జడ్‌పిటిసి, ఎంపిపిలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా పాలనందించేందుకు నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, కొందూటి నరేందర్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, మున్సిపాలిటి అధ్యక్షుడు ఎంఎస్ నటరాజన్, టిఆర్‌ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
* నందిగామలో… నందిగామ మండల పరిధిలోని నూతనంగా ఏర్పడిన తాళ్లగూడ, అప్పరెడ్డిగూడ, మోత్కులగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ, వెంకమ్మగూడ, చాకలిదానిగుట్టతండా, శ్రీనివాసులగూడ, కాన్వా గ్రామపంచాయతీలను షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై ప్రారంభించారు. అంతేకాకుండా మొదళ్లగూడ గ్రామ పంచాయతీని జడ్‌పివైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలతోపాటు నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్, కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లెల వెంకట్‌రెడ్డి, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు పద్మారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చేగూరి విఠల్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
* కొత్తూరులో…కొత్తూరు మండల పరిధిలోని ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్, కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ జిల్లెల వెంకట్‌రెడ్డి, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు పద్మారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చేగూరి విఠల్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
* కొందుర్గులో… మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన పులుసుమామిడి, ఆగిర్యాల, గంగన్నగూడెం, బైరంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, లాలాపేట, అయోద్యపూర్ తండా గ్రామ పంచాయతీ భవనాలను షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్‌పటేల్, శ్రీదర్‌రెడ్డి, మంగులాల్, బలవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* కీసరలో…కొత్త పంచాయతీల ఏర్పాటుతో గ్రామీణులకు స్థానిక పాలన మ రింత చేరువ కానుందని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. గురు వారం మండలంలోని కొత్తగా ఏర్పాటు చేసిన కరీంగూడ, నర్సంపల్లి గ్రామ పంచాయతీలను ఎమ్మెల్యే లాంచనంగా ప్రారంభించారు. పూలు, పచ్చటి తోర ణాలు, డప్పు చప్పుల్లు, దూందాం, విందు బోజనాలతో ప్రారంభోత్సవ వేడుక లను పండుగలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యంలో కొత్త పంచాయ తీలను ఏర్పాటు చేయడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారెడ్డి నందారెడ్డి, ఎంపీపీ ఆర్.సుజాత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లకా్ష్మరెడ్డి, ఎంపీడీఓ కె.వినయ్‌కుమార్, ఎంపీటీసీ కె.మల్లేష్, మాజీ సర్పంచ్‌లు ఎం.జ్యోతి సురేష్, ఎండీ ఖలీల్, మడల టీఆర్‌ఎస్ అధ్యక్షులు మోర రవికాంత్ ముదిరాజ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.