Search
Saturday 22 September 2018
  • :
  • :

నూతన గ్రామ పంచాయతీలతో..గ్రామ స్వరాజ్యం..

stand2

* పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోండి..
* పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి
శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు

మన తెలంగాణ/పాన్‌గల్ : తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తెచ్చి అనుబంధ గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా గుర్తించడంతో గ్రామ స్వరా జ్యం ఏర్పడుతుందని పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఆదివారం ఆయన పాన్‌గల్ మండలంలో నూతనంగా గ్రామ పంచాయతీ లుగా ఏర్పడిన తెల్లరాళ్లపల్లి తాండా. నిజామాబాద్ ,బండపల్లి,బహదూర్‌గూడెం,శాగాపూర్ తాండా, మాధవరావుపల్లి, బహదూర్ గూడెం, కొత్తపేట, కిష్టాపూర్ గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడారు. పాత పంచాయతీల నుండి అనుబంధ గ్రామాలు విడిపోయి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడినప్పటికి ప్రజల మధ్య విభేదాలు లేకుడా కలిసి మెలిసి మెలగాలని మంత్రి కోరారు. రాష్ట్రం ఏర్పాటు అనతరం ప్రజ లకు పాలన చేరువైందన్నారు. గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి కాల్వలకు నీటిని విడుదల చేయడంతో రైతుల కళ్లల్లో ఆనందం చూడడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తా గునీరు అందజేయడం జరుగుతుందన్నారు. పేదింటి ఆడపడుచుల వివాహాల కోసం కళ్యా ణ లక్ష్మీ ,షాదీముబారక్ పథకాల ద్వారా రూ. లక్ష 116లను అందజేయడం జరుగుతుం దన్నారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఎకరాకు రైతుకు రూ. 4వేల పెట్టుబడి సహాయాన్ని ఈనెల 20 నుండి ప్రవేశ పెట్టడం జరుగుతుం దన్నారు.నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన ప్రజలు ఐక్యంగా సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ 49 సంవత్సరాలు పాలించిన గుర్తుకు రాని అభివృద్ధి ఇప్పుడుఎందుకు వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. గతం లో కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని మూడున్నర సంవత్సరాల్లో అభివృ ద్ధి చేసి చూపించామన్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర చేపడుతున్నారని మంత్రి జూపల్లి ప్రశ్నిం చారు. కార్యక్రమంలో జడ్పిటిసి కేతేపల్లి రవి, ఎంపిపి వెంకటేష్ నాయుడు,తెరాస అధ్యక్షు లు గోవర్ధన్‌సాగర్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు జయరాములు సాగర్, జిల్లా నాయకులు తిరుపతయ్య సాగర్, కేతేపల్లి విష్ణు, రాజునాయక్, బల్‌రాం నాయక్, నాగేంద్రం రాంచం దర్‌రావు , లచ్చగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments